చీరలోనే చాలా సౌకర్యంగా ఉంది

చీరలోనే చాలా సౌకర్యంగా ఉంది
x
Lakshmi Bomb Movie look
Highlights

ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు , దర్శకుడు రాఘవ లారెన్స్ నటించిన కాంచన తెలుగుతోపాటు పలు భాషల్లో సంచలన విజయం నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా...

ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు , దర్శకుడు రాఘవ లారెన్స్ నటించిన కాంచన తెలుగుతోపాటు పలు భాషల్లో సంచలన విజయం నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా చిత్రాన్ని బాలీవుడ్‌లో లక్ష్మీ బాంబ్ గా రీమేక్ చేస్తున్నారు. హిందీలో రిమేక్ అవుతున్న ఈ చిత్రానికి లారెన్స్ దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. అక్షయ్ కుమార్, తుషార్ కపూర్, షబీనా ఖాన్ కలిసి ఫాక్ స్టార్ స్టూడియోస్ , కేప్ గుడ్ ఫిల్మీస్ సంయుక్తంగా నిర్మిస్తు్న్నాయి.

అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లూక్ విడుదల చేశారు. అక్షయ్ కుమార్ చీర కట్టుకుని నటించడం సౌకర్యంగా ఉందని పేర్కొన్నారు. చీరతో చేసే షూటింగ్‌ షాట్స్‌ సౌకర్యంగానే ఉన్నాయని తెలిపారు. లక్ష్మీబాంబ్ చిత్రం గురించి మాట్లాడిన ఆయన చీరలో కట్టుకుని షూటింగ్‌లో పాల్గొనడానికి నాకు ఎలాంటి సమస్య లేదు. విభిన్నపాత్రలు చేయడమంటే చాలా ఇష్టం. నేను చేసిన పాత్రల్లో ఇప్పుడు చేస్తున్న పాత్ర చాలా కష్టమైనదన్నారు. అభిమానులను మెప్పించే విధంగా బాడీ లాంగ్వేజ్ మార్చుకోవాల్సి ఉందని అక్షయ్ కుమార్ చెప్పారు.

2019లో విడుదలైన అక్షయ్‌ కుమార్ సినిమాల బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు రాబట్టాయి. ఇటీవల విడుదలైన'గుడ్‌న్యూస్‌' మంచి జోష్ మీద ఉన్నారు. 'లక్ష్మీ బాంబ్‌'గా రీమేక్‌ లో అక్షయ్‌ కుమార్ ట్రాన్స్‌ జెండర్‌గా కనిపించనున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి సంబంధించిన తాజగా విడుదల చేసిన పోస్టర్ లో అక్షయ్‌ కుమార్ కాంచన గెటప్ లో ఎరుపు రంగు చీర, తిలకం పెట్టుకుని అమ్మవారి విగ్రహం ముందు నిలుచుని ఉన్న స్టిల్ అశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తున్నారు. తరుణ్ అరోరా, శరద్ కేల్కర్, తుషార్ కపూర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories