కన్నప్పలో శివయ్యగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్... డిజప్పాయింట్‌లో ప్రభాస్ ఫ్యాన్స్

Akshay Kumar as Lord Shiva in Kannappa movie
x

శివుని పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్.. కన్నప్ప నుంచి కొత్త పోస్టర్ రిలీజ్

Highlights

Akshay Kumar as Lord Shiva in Kannappa movie: హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న చిత్రం కన్నప్ప. మహాభారత సిరీస్‌ని తెరకెక్కించిన...

Akshay Kumar as Lord Shiva in Kannappa movie: హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న చిత్రం కన్నప్ప. మహాభారత సిరీస్‌ని తెరకెక్కించిన ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో ఈ సినిమా సిద్ధమవుతోంది. ఈ మూవీలో ప్రీతి ముకుందన్ కథానాయికగా నటిస్తున్నారు. అక్షయ్ కుమార్ ఈ సినిమాలో శివుని పాత్రలో నటిస్తున్నారు. తాజాగా అక్షయ్ కుమార్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో శివుడి పాత్రలో అక్షయ్ కుమార్ త్రిశూలం, ఢమరుకం పట్టి నాట్యం చేస్తున్నట్టు ఉంది. ప్రస్తుతం ఈ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది.

మహదేవ్ పాత్రలో నటించడంపై అక్షయ్ కుమార్ ఆనందం వ్యక్తం చేశారు. ఇది తనకెంతో ప్రత్యేకమన్నారు. ఈ సినిమాలో అన్ని ఇండస్ట్రీల నుంచి స్టార్ హీరోలు, హీరోయిన్స్ నటిస్తున్నారు. బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్, మాలీవుడ్ నుంచి మోహన్ లాల్, టాలీవుడ్ నుంచి ప్రభాస్, కోలీవుడ్ నుంచి శరత్ కుమార్, ప్రభుదేవా వంటి వారు పలు పాత్రల్లో నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో పలువురి పాత్రల పోస్టర్స్‌తో పాటు కన్నప్ప టీజర్ కూడా రిలీజ్ చేశారు.

భారీ బడ్జెట్‌, అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మొదట ఈ చిత్రాన్ని ప్రకటించినప్పుడు ప్రభాస్-నయనతారలు శివపార్వతులుగా కనిపించనున్నారని టాక్ వినిపించింది. కానీ శివుడిగా అక్షయ్ కుమార్ నటిస్తున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఇక పార్వతీదేవి పాత్రలో కాజల్ నటిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఆమె పార్వతి దేవి లుక్ విడుదల చేశారు.

ప్రస్తుతం అక్షయ్ కుమార్‌ శివుడి పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఎందుకంటే ఇన్నాళ్లు పరమశివుడిగా ప్రభాస్ నటిస్తున్నాడని వార్తలు వచ్చాయి. దీంతో అంతా శివుడిగా ప్రభాస్ ఎలా ఉంటారో చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంతలోనే శివుడిగా అక్షయ్ పోస్టర్ రిలీజ్ చేయడంతో షాక్ మామూలుగా లేదని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం గూస్‌బంప్స్ వస్తున్నాయని కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీలో ప్రభాస్ నంది పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం.

కన్నప్ప చిత్రం ఎక్కువ భాగం న్యూజిలాండ్‌లో చిత్రీకరించారు. అక్కడే ఈ సినిమా షూట్ చేయడానికి గల కారణాన్ని చెన్నైలో జరిగిన ప్రెస్‌మీట్‌లో చిత్రబృందం తెలియజేసింది. ఈ చిత్ర కథ మూడో శతాబ్ధ కాలం నాటిది. ఆనాటి ప్రకృతి రమణీయతను చిత్రంలో చూపించాల్సి ఉండడంతో న్యూజిలాండ్‌లో చిత్రీకరణ చేపట్టామని చెప్పింది.

ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అన్ని అప్‌డేట్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న కన్నప్ప మూవీని అవా ఎంటర్‌టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్ బాబు నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 25న ఈ సినిమా విడుదల కానుంది. ఇక విడుదల సమయం దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచారు చిత్ర బృందం. ప్రతి సోమవారం ఓ పోస్టర్‌ను విడుదల చేస్తూ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories