యువ హీరోలు కూడా ప్యాన్ ఇండియా సినిమాలు చేస్తుంటే అక్కినేని హీరోలు మాత్రం ఎందుకిలా?

*ప్యాన్ ఇండియా సినిమాకి దూరంగా ఉంటున్న అక్కినేని యువ హీరోలు

Jyothi
Published on: 24 Nov 2022 3:47 PM IST
Akkineni is a young Heros is Staying Away From Pan India Cinema
X

యువ హీరోలు కూడా ప్యాన్ ఇండియా సినిమాలు చేస్తుంటే అక్కినేని హీరోలు మాత్రం ఎందుకిలా?

Akkineni Heros: ఈ మధ్యకాలంలో ప్యాన్ ఇండియా సినిమాల హవా బాగా నడుస్తోంది. తమ సినిమాలను తెలుగులో మాత్రమే కాక వేరే భాషల్లో కూడా విడుదల చేయడానికి యువ హీరోలు నుండి స్టార్ హీరో ల దాకా అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే ఇండస్ట్రీలో ఉన్న అందరూ స్టార్ హీరోలు ప్యాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇక తాజాగా ఇప్పుడు యువ హీరో అడివి శేష్ కూడా త్వరలోనే ఒక ప్యాన్ ఇండియా సినిమా చేయబోతున్నట్లుగా ప్రకటించారు.

ఈ మధ్యనే "మేజర్" సినిమాతో మంచి హిట్ అందుకున్న అడివి శేష్ తాజాగా ఇప్పుడు శైలేష్ కొలను దర్శకత్వంలో "హిట్: ది సెకండ్ కేస్" సినిమాతో బిజీగా ఉన్నారు. న్యాచురల్ స్టార్ నాని నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 2న థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ మధ్యనే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. తాజాగా ఇప్పుడు ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై ఒక సినిమాని సైన్ చేశారు అడివి శేష్. ఈ సినిమా ప్యాన్ ఇండియా సినిమా అని శేష్ ప్రకటించారు.

ఈ నేపథ్యంలో దాదాపు అందరూ టాలీవుడ్ హీరోలు ఏదో ఒక రకంగా ప్యాన్ ఇండియా సినిమాలు తీస్తున్నారని కానీ అక్కినేని యువ హీరోలు మాత్రం ప్యాన్ ఇండియా ఊసే ఎత్తటం లేదని కామెంట్లు చేస్తున్నారు. మరి అక్కినేని నాగచైతన్య మరియు అక్కినేని అఖిల్ ఎప్పుడు తమ ప్యాన్ ఇండియా డెబ్యూ తో ప్రేక్షకుల ముందుకి వస్తారో వేచి చూడాలి.

Jyothi

Jyothi

Next Story