Mohan Raja: "గాడ్ ఫాదర్" కారణంగా వెనకడుగు వేసిన అక్కినేని హీరో

*నాగ్ ఈ సినిమా ను హోల్డ్ లో పెట్టి ఒక రెండు నెలల తర్వాత దీని గురించి ఫైనల్ కాల్ చేస్తారని తెలుస్తోంది

R Tripura Malini
Published on: 16 Nov 2022 11:39 AM IST
akkineni hero backed out from mohan raja film
X

Mohan Raja: "గాడ్ ఫాదర్" కారణంగా వెనకడుగు వేసిన అక్కినేని హీరో

Mohan Raja: మలయాళం లో సూపర్ హిట్ అయిన "లూసిఫర్‌" కి రీమేక్‌గా తెరకెక్కిన మెగాస్టార్ చిరంజీవి "గాడ్‌ఫాదర్" బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించలేకపోయింది. విమర్శకుల నుండి మంచి రివ్యూలు అందుకున్న ఈ సినిమా కలెక్షన్ల పరంగా మాత్రం అంతగా ఆకట్టుకోలేక పోయింది. సినిమా ఫైనల్ కలెక్షన్ లు అంత ఆశాజనకంగా లేవు. అయితే సినిమా మంచి రివ్యూ లు అందుకున్నప్పటికీ, కలెక్షన్లు లేకపోవడం తో సినిమాకి దర్శకత్వం వహించిన మోహన్ రాజా మీద ఈ ఎఫెక్ట్ బాగానే పడింది. "గాడ్ ఫాదర్" సినిమా ఒక్ చేయడానికి ముందే అక్కినేని నాగార్జున తో మోహన్ రాజా ఒక సినిమా చేయాల్సి ఉంది. ఆ ప్రాజెక్ట్‌లో అఖిల్‌ కూడా ఉంటాడని గాడ్‌ఫాదర్‌ ప్రమోషన్స్‌లో మోహన్‌రాజా హింట్ ఇచ్చారు.

అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తే మాత్రం ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం కనిపించడం లేదని సమాచారం. థియేట్రికల్‌ సేల్స్‌ను రికవరీ కూడా చేయలేక పూర్తిగా నష్టాలు కలిగించిన "గాడ్‌ఫాదర్‌" రిజల్ట్‌ చూసి నాగార్జున ఈ సినిమా విషయం లో మళ్లీ ఆలోచనలో పడ్డారని సమాచారం. ప్రస్తుతానికి, నాగ్ ఈ సినిమా ను హోల్డ్ లో పెట్టి ఒక రెండు నెలల తర్వాత దీని గురించి ఫైనల్ కాల్ చేస్తారని తెలుస్తోంది. ఏదేమైనా సినిమా కలెక్షన్ల విషయంలో తేడా కొట్టడం తో డైరెక్టర్ మోహన్ రాజా కెరీర్ కి దెబ్బ కొట్టినట్టు చెప్పుకోవచ్చు. మరి మోహన్ రాజా తన తదుపరి సినిమా గురించి ఏం చేయబోతున్నారా అని ఇంకా తెలియాల్సి ఉంది.

R Tripura Malini

R Tripura Malini

Next Story