మెగా క్యాంప్ లో చేరిన అక్కినేని బ్రదర్స్

మెగా క్యాంప్ లో చేరిన అక్కినేని బ్రదర్స్
x
Highlights

గత కొంత కాలం గా అక్కినేని బ్రదర్స్ నాగచైతన్య మరియు అఖిల్ లు హిట్ సినిమా కోసం పాటు పడుతున్నారు కానీ వాళ్ళ ఆశలు తీరట్లేదు. చేసిన ప్రతి సినిమా,...

గత కొంత కాలం గా అక్కినేని బ్రదర్స్ నాగచైతన్య మరియు అఖిల్ లు హిట్ సినిమా కోసం పాటు పడుతున్నారు కానీ వాళ్ళ ఆశలు తీరట్లేదు. చేసిన ప్రతి సినిమా, బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారుతోంది. అయితే ఇప్పుడు వీరిద్దరూ మెగా నిర్మాత అల్లు అరవింద్ గూటికి చేరారు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ ఒక సినిమాను నిర్మించనున్నారు. ఏర్పాట్లు చేస్తున్నాడు. అఖిల్ కు తగ్గట్లుగా ఉండే బొమ్మరిల్లు భాస్కర్ ఒక స్క్రిప్ట్ సిద్ధం చేసాడని తెలుస్తోంది. త్వరలోనే సినిమా షూటింగ్ పట్టాలెక్కనుంది.

గీతా ఆర్ట్స్ సినిమా అంటే ఖచ్చితంగా మ్యాటర్ ఉంటుందని అందరి అభిప్రాయం ఉంది. ఇదిలా ఉండగా, నాగచైతన్య కూడా గీతాఆర్ట్స్ లో ఒక సినిమా చేయబోతున్నాడు. 'గీత గోవిందం' ఫేమ్ పరుశురామ్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా నటిస్తున్న ఒక సినిమ ను గీత ఆర్ట్స్ నిర్మిస్తోంది. ఇది ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ అని సమాచారం. అంటే అక్కినేని బ్రదర్స్ ఇద్దరూ ఒకే సారి అల్లు అరవింద్ తో పనిచేయనున్నారు. ఇప్పటిదాకా బోలెడు సూపర్ హిట్స్ ఇచ్చిన గీతా ఆర్ట్స్ ఈ ఇద్దరూ హీరోలకు సక్సెస్ అందిస్తుందో లేదో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories