Akkineni Akhil: "నా దృష్టి మొత్తం కెరియర్ పైనే" అంటున్న హీరో

* పెళ్లి గురించి స్పందించిన అక్కినేని అఖిల్

admin1
Updated on: 19 Oct 2021 12:29 PM IST
Akkineni Akhil Says My Total Focus is on My Movies and Carrer Only
X

అక్కినేని అఖిల్ (ట్విట్టర్ ఫోటో)

Akkineni Akhil: ఇండస్ట్రీ లో హీరోగా అడుగుపెట్టినప్పటి నుంచి ఒక్క హిట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అక్కినేని యువ హీరో అఖిల్ తాజాగా "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్" సినిమాతో ఎట్టకేలకు హిట్ కొట్టాడు. ఈ నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. సినిమా ట్రైలర్ లో అఖిల్ రెండు విభిన్న లుక్స్ తో కనిపిస్తారు. అవి ఒక యువకుడి జీవితంలో రెండు ఫేజ్ లను సూచిస్తున్నాయి అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ మొత్తం కెరియర్ కి ప్రాధాన్యత ఇస్తాడు అఖిల్. కానీ సెకండ్ హాఫ్ లో ప్రేమ మరియు పెళ్లికి ప్రాముఖ్యతని ఇస్తాడు. మరి ప్రస్తుతం రియల్ లైఫ్ లో అఖిల్ ప్రస్తుతం ఏ ఫేజ్ లో ఉన్నాడు?

ఇదే ప్రశ్న అడగగా అఖిల్ ఇలా సమాధానం ఇచ్చారు, "ఇప్పటికి ఇప్పుడు నన్ను అడిగితే నేను 100% కెరీర్ అనే చెప్తాను. ప్రస్తుతం నేను నా కెరియర్ కి చాలా ప్రాధాన్యతను ఇస్తున్నాను. ఇంకా మిగతా దేని గురించి ఆలోచించే సమయం నాకు లేదు. నాకు తొందర్లోనే పెళ్లి చేసుకోవాలని కూడా లేదు. పెళ్లి చేసుకోవడానికి అంటే ముందు నేను సాధించాల్సింది చాలా ఉన్నాయి. గత సంవత్సరం మొత్తం కోవిడ్ వల్ల చాలా సమయం కోల్పోయాము. అందుకే ఇప్పుడు కాసేపు కూడా వేస్ట్ చేయాలి అనుకోవట్లేదు" అని చెప్పిన అఖిల్ ప్రస్తుతం తన దృష్టి మొత్తం కెరీర్ మీదనే ఉందని క్లారిటీ ఇచ్చాడు. తాజాగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ "ఏజెంట్" అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

admin1

admin1

Next Story