Akkineni Akhil: ఉన్నట్టుండి రెమ్యూనరేషన్ పెంచిన అక్కినేని హీరో

Akkineni Akhil Hikes his Remuneration After Most Eligible Bachelor Movie Success
x

రెమ్యూనరేషన్ పెంచిన అక్కినేని హీరో 

Highlights

* ఒక సినిమా సక్సెస్ అవడంతో రెమ్యూనరేషన్ పెంచిన అక్కినేని అఖిల్

Akkineni Akhil: మొన్నటిదాకా వరుస డిజాస్టర్లతో సతమతమైన యువ హీరో అక్కినేని అఖిల్ తాజాగా విడుదలైన "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్" సినిమాతో మంచి హిట్ ను అందుకున్నాడు. అయితే ఎట్టకేలకు ఒక సినిమా హిట్ అవ్వడంతో అఖిల్ తన రెమ్యూనరేషన్ ని అమాంతం పెంచేసాడని సమాచారం.

మొన్నటి దాకా ఫ్లాపులతో ఉన్న కారణం వల్ల అఖిల్ మిగతా యువ హీరోలతో పోలిస్తే తక్కువ పే తీసుకునే వాడు. కానీ "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్" సినిమాతో మంచి హిట్ అందుకున్న అఖిల్ తన మార్కెట్ కూడా పెరగడంతో తదుపరి సినిమా కోసం రెమ్యునరేషన్ని ఎక్కువ చేశాడట.

అయితే అఖిల్ ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో "ఏజెంట్" సినిమా చేయబోతున్నారు. ఈ సినిమా కి అఖిల్ ఆల్రెడీ కమిట్మెంట్ ఇచ్చేయడంతో ఈ సినిమాకి మాత్రం మిగతా సినిమాల్లో లాగానే రెమ్యూనరేషన్ తక్కువగానే తీసుకోబోతున్నాడట. కానీ ఇకపై ఒప్పుకునే సినిమాల కోసం మాత్రం రేమ్యూనరేషన్ కొంచెం పెంచుదామని డిసైడ్ అయ్యాడు ఈ అక్కినేని హీరో.

ఇక ఈ సినిమా సక్సెస్ అవడంతో పలు నిర్మాణ దర్శకనిర్మాతలు కూడా ఓ సినిమా చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఒకవైపు "లవ్ స్టోరీ" సినిమాతో నాగచైతన్య మరోవైపు "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్" తో అఖిల్ ఇద్దరూ సక్సెస్ అందుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories