OTT: ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసిన అఖిల్‌ ఏజెంట్‌.. స్ట్రీమింగ్ ఎందులో అంటే?

Akhils Agent Finally Streams on OTT Where to Watch
x

OTT: ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసిన అఖిల్‌ ఏజెంట్‌.. స్ట్రీమింగ్ ఎందులో అంటే?

Highlights

OTT: అక్కినేని నట వారసుడు అఖిల్‌కు ఇప్పటి వరకు ఆశించిన విజయం లభించలేదనే చెప్పాలి.

OTT: అక్కినేని నట వారసుడు అఖిల్‌కు ఇప్పటి వరకు ఆశించిన విజయం లభించలేదనే చెప్పాలి. ఎన్ని ప్రయత్నాలు చేసినా అఖిల్‌కు ఆశించిన విజయం మాత్రం దక్కలేదు. కాగా అఖిల్‌ చివరిగా నటించి ఏజెంట్‌ సైతం భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది.

ఇదిలా ఉంటే థియేటర్లలోకి వచ్చిన ఏజెంట్‌ ఓటీటీలో మాత్రం రాలేదు. థియేటర్లలోకి వచ్చి నెలలు గడిచినా ఓటీటీ విడుదల వాయిదా పడుతూ వచ్చింది. గతంలో పలుసార్లు ఏజెంట్‌ ఓటీటీ రిలీజ్‌ వాయిదా పడగా. ప్రస్తుతం ఓటీటీలోకి వచ్చేసింది. సోనీలివ్ వేదికగా మార్చ్ 13న సాయంత్రం నుంచే స్ట్రీమింగ్‌ ప్రారంభమైంది. మొదట మార్చ్ 14 హోలీ సందర్భంగా స్ట్రీమింగ్‌ను ప్లాన్ చేసినా, ఒక రోజు ముందుగానే ప్రేక్షకుల ముందుకొచ్చింది.

ఈ చిత్రంలో అఖిల్ పూర్తి ట్రాన్స్‌ఫర్మేషన్‌తో కనిపించాడు. ప్రత్యేకంగా సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించాడు. అయితే అఖిల్‌ శ్రమకు తగ్గ ఫలితం మాత్రం కనిపించలేదు. మరి థియేటర్లలో డిజాస్టర్‌గా మిగిలిన ఏజెంట్‌ మూవీకి ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్‌ వస్తుందో చూడాలి. ఇదిలా ఉంటే ఏజెంట్ రిజల్ట్‌ తర్వాత అఖిల్‌ పూర్తిగా సైలెంట్‌ అయిపోయాడు. గత కొంతకాలంగా పబ్లిక్‌లో కనిపించడం లేదు. ఇప్పటివరకు తన తదుపరి సినిమా గురించి ఎలాంటి అధికారిక సమాచారం చేయలేదు. కాగా అఖిల్‌ తన తదుపరి ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను త్వరలోనే ప్రకటిచనున్నారని ప్రచారం జరుగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories