‘Akhanda 2’ vs ‘OG’: ఇద్దరు స్టార్ హీరోల మధ్య గట్టి పోటీ.. గెలిచేది ఎవరు? ఓడేది ఎవరు?

‘Akhanda 2’ vs ‘OG’:  ఇద్దరు స్టార్ హీరోల మధ్య గట్టి పోటీ.. గెలిచేది ఎవరు? ఓడేది ఎవరు?
x

‘Akhanda 2’ vs ‘OG’: ఇద్దరు స్టార్ హీరోల మధ్య గట్టి పోటీ... గెలిచేది ఎవరు? ఓడేది ఎవరు?

Highlights

‘Akhanda 2’ vs ‘OG’: సెప్టెంబర్ 25. ఆ రోజు ఇద్దరు పెద్ద హీరోల మధ్య గట్టి పోటీ జరగనుంది. అయితే ఈ పోటీలో ఎవరు గెలుస్తారన్నదే పెద్ద సస్పెన్స్‌గా ఉంది.

‘Akhanda 2’ vs ‘OG’: సెప్టెంబర్ 25. ఆ రోజు ఇద్దరు పెద్ద హీరోల మధ్య గట్టి పోటీ జరగనుంది. అయితే ఈ పోటీలో ఎవరు గెలుస్తారన్నదే పెద్ద సస్పెన్స్‌గా ఉంది. ముఖ్యంగా ఈ హీరోల కంటే వారి ఫ్యాన్స్‌లో ఈ పోటీ జరిగేటట్టు ఉండడంతో ఇప్పుడు అందరి దృష్టి ఈ హీరోలపైనే ఉంది. వివరాలు చూద్దాం..

టాలీవుడ్‌లో స్టార్ హీరోల సినిమాల రిలీజ్ అంటే అభిమానులకు పెద్ద పండుగే. అటువంటిది ఇద్దరు స్టార్ హీరోల సినిమా ఒకేరోజు విడుదలైతే.. ఇక ఆ పరిస్థితి ఎలా ఉంటుంది? ఎందుకంటే హీరోల కంటే అభిమానులే సంబరాలు చేసుకుంటారు. కానీ అందులో ఒక సినిమా హిట్, మరొక సినిమా ఫట్ అయితే.. ఇక అభిమానుల మధ్య యుద్ధమే నడుస్తాది. ఇంతకీ ఏ సినిమా హీరోల గురించి చెబుతున్నానో మీకు అర్ధం అయ్యే ఉంటుంది. అవును.. సెప్టెంబర్ 25న అఖండ 2 అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఓజీ కూడా అదే రోజు విడుదల కానున్నాయి. దీంతో ఈ రెండు సినిమాల్లో ఏది విజయం సాధిస్తుందోనని అభిమానులు తెగ ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

నందమూరి బాలకృష్ణ కెరీర్‌‌లో బిగ్గెస్ట్ హిట్ అఖండ. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు దానికి సీక్వెల్ అఖండ 2 సెప్టెంబర్ 25న విడుదల కానుంది. ఈ సారి ఈ సినిమాలో అంతకుమించి ఉన్నట్టు ఇటీవల దర్శకుడు శ్రీను అన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన టీజర్ అంచనాలను మించిపోయింది. ఇక ఇప్పుడు ఈ సినిమా థియేటర్లోకి వచ్చిన తర్వాత దద్దరిల్లిపోతుందనే అందరూ అనుకుంటున్నారు.

ఇక సెప్టెంబర్ 25న రిలీజ్ కానున్న మరో సినిమా పవన్ కళ్యాణ్ ఓజీ. యంగెస్ట్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రియాంక మోహన్ నటిస్తున్నారు. ఇమ్రాన్ హస్కీ విలన్‌గా కనిపిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్లు రిలీజ్ కావడంతో తెగ సెన్సేషన్ అయిపోయాయి. ఎప్పుడెప్పుడా అని ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. దీనికోసం సెప్టెంబర్ 25న రిలీజ్‌డేట్ ప్రకటించారు.

టాలీవుడ్‌లో ఇద్దరూ పెద్ద హీరోలే. రెండు సినిమాలూ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నవే. అయితే ఈ రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ కావడం, అందునా ఇద్దరు కూటమి ప్రభుత్వంలో ఉండటం.. ఇప్పుడు ఈ సినిమాల విడుదలపై అందరికీ ఆసక్తి పెరిగిపోయింది. ఈ పోటీలో ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడిపోతారన్నది ఇక తెలియాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories