Akhanda 2 Update: ‘అఖండ 2’లో ‘బజరంగీ భాయిజాన్’ మున్నీ.. హర్షాలీ మల్హోత్రా లుక్ చూసి షాక్ అవుతారు!

Akhanda 2 Update: ‘అఖండ 2’లో ‘బజరంగీ భాయిజాన్’ మున్నీ.. హర్షాలీ మల్హోత్రా లుక్ చూసి షాక్ అవుతారు!
x

Akhanda 2 Update: ‘అఖండ 2’లో ‘బజరంగీ భాయిజాన్’ మున్నీ.. హర్షాలీ మల్హోత్రా లుక్ చూసి షాక్ అవుతారు!

Highlights

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘అఖండ 2: తాండవం’ పై భారీ అంచనాలు ఉన్నాయి. 2021లో వచ్చిన ‘అఖండ’ బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించగా, ఇప్పుడు దీని సీక్వెల్‌ను పాన్ ఇండియా స్థాయిలో రూపొందించి విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు.

Akhanda 2 Update: నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘అఖండ 2: తాండవం’ పై భారీ అంచనాలు ఉన్నాయి. 2021లో వచ్చిన ‘అఖండ’ బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించగా, ఇప్పుడు దీని సీక్వెల్‌ను పాన్ ఇండియా స్థాయిలో రూపొందించి విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు. బాలకృష్ణ మరోసారి అఘోరా పాత్రలో దర్శనమివ్వనున్న ఈ చిత్రానికి సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. విలన్‌గా ఆది పినిశెట్టి కనిపించనున్నారు.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర అప్డేట్‌ ఒకటి బయటకు వచ్చింది. బాలీవుడ్‌లో ‘బజరంగీ భాయిజాన్’ చిత్రంతో మున్నీగా ప్రేక్షకులను కట్టిపడేసిన బాల నటీమణి హర్షాలీ మల్హోత్రా ఈ చిత్రంలో జనని అనే కీలక పాత్రలో నటించనుంది. అప్పట్లో చిన్నారి మున్నీగా క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఎంతో మంది అభిమానుల మనసులు గెలుచుకున్న హర్షాలీ.. ఇప్పుడు పెద్దమ్మాయిగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతోంది.

ఈ సందర్భంగా మేకర్స్ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అందులో హర్షాలీ నవ్వుతూ, సంపూర్ణ శోభతో కనిపించడం విశేషం. గతంలో బాలయ్య ఇచ్చిన మాట ప్రకారం.. తనకు ఏ కష్టం వచ్చినా పిలవమని చెప్పిన చిన్నారి జననీ.. ఇప్పుడు పెద్దదై తిరిగి బాలయ్యను కలుసుకునే కథనే 'అఖండ 2'లో చూపించనున్నట్లు సమాచారం.



హిందీ భాషాభిమానులకు కనెక్ట్ అవ్వడానికి బోయపాటి బాలీవుడ్ స్టార్స్‌తో పాటు నేషనల్ రేంజ్‌లో ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నట్లు నెట్‌జన్లు చెబుతున్నారు. ఈ మూవీని సెప్టెంబర్ 25, దసరా సందర్భంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories