Akhanda 2: అఖండ 2 తాండవానికి ఓటీటీ డీల్ ఫిక్స్ అయిందా?

బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వచ్చిన అఖండ ఎంత భారీ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సక్సెస్ తర్వాతే సీక్వెల్ ఉంటుందని అప్పుడే ప్రకటించారు. ప్రస్తుతం అఖండ 2 సీక్వెల్ పనులు వేగంగా పూర్తవుతున్నాయి.

Ramya Vegirouthu
Updated on: 18 Aug 2025 9:15 PM IST
Akhanda 2: అఖండ 2 తాండవానికి ఓటీటీ డీల్ ఫిక్స్ అయిందా?
X

Akhanda 2: అఖండ 2 తాండవానికి ఓటీటీ డీల్ ఫిక్స్ అయిందా?

బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వచ్చిన అఖండ ఎంత భారీ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సక్సెస్ తర్వాతే సీక్వెల్ ఉంటుందని అప్పుడే ప్రకటించారు. ప్రస్తుతం అఖండ 2 సీక్వెల్ పనులు వేగంగా పూర్తవుతున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ పనులు, ముఖ్యంగా VFX వర్క్‌ శరవేగంగా జరుగుతున్నాయి. మొదట ఈ సినిమాను సెప్టెంబర్ 25న దసరా కానుకగా విడుదల చేయాలని అనుకున్నారు. కానీ అప్పటికి పూర్తి కావడం కష్టమేనన్న ప్రచారాలు గట్టిగానే వినిపిస్తున్నాయి.

అయినా కూడా దర్శకుడు బోయపాటి శ్రీను, హీరో బాలకృష్ణ ఈ సినిమాను దసరాకే రిలీజ్ చేయాలనే పట్టుదలతో ఉన్నారని సమాచారం. ఇదిలా ఉంటే, అఖండ 2 ఓటీటీ హక్కుల రేసులో జియో హాట్‌స్టార్ ముందంజలో ఉంది. అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ కంటే ఎక్కువ ధర ఆఫర్ చేసినట్టుగా తెలుస్తోంది. దీంతో ఈ సినిమా డిజిటల్ రైట్స్ జియో హాట్‌స్టార్‌దేనని టాక్. అయితే థియేట్రికల్ రిలీజ్ మాత్రం ఇంకా అనిశ్చితంగా ఉంది. సినిమా పూర్తి అవుట్‌పుట్ వచ్చాకే సెప్టెంబర్ 25న రిలీజ్ అవుతుందా లేదా అన్న క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Ramya Vegirouthu

Ramya Vegirouthu

Next Story