మహా కుంభమేళాలో అఖండ2.. గూస్‌బంప్స్ తెప్పించే విషయాలు చెప్పిన బోయపాటి..!

Akhanda 2 Begins Filming at Maha Kumbh Mela 2025
x

మహా కుంభమేళాలో అఖండ2.. గూస్‌బంప్స్ తెప్పించే విషయాలు చెప్పిన బోయపాటి..!

Highlights

Maha Kumbh Mela 2025: బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను రూపొందించిన అఖండ సినిమా ఏ స్థాయిలో విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

Maha Kumbh Mela 2025: బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను రూపొందించిన అఖండ సినిమా ఏ స్థాయిలో విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీనికి సీక్వెల్‌గా అఖండ2 రాబోతోంది. ఈ సినిమా షూటింగ్ కూడా ఇటీవల మొదలైంది. కుంభమేళాలో ఈ సినిమాకు సంబంధించిన కొన్ని షాట్స్ చిత్రీకరించారు. షూటింగ్‌కు సంబంధించి బోయపాటి శ్రీను కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

మహాకుంభ మేళాలో ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయి. దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. షూట్ కోసం మేము ఇక్కడికి వచ్చాం. మాది అఘోరా నేపథ్యంలో సాగే కథ. సినిమాలోని కొన్ని సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించేందుకు వచ్చాం. జనవరి 11 నుంచి ఇక్కడే ఉన్నాం. జనవరి 16తో షూటింగ్ పూర్తయిందన్నారు. నాగ సాధువులు, అఘోరాలను కలిశాం. మా ప్రయత్నలోపం లేకుండా చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు అన్ని విధాలా శ్రమిస్తున్నాం అని బోయపాటి శ్రీను చెప్పారు.

ఈ కామెంట్లు విని బాలయ్య ఫ్యాన్స్ తెగ పోస్టులు పెడుతున్నారు. ముఖ్యంగా కుంభమేళా లైవ్ షాట్స్ అఖండ2లో చూపించబోతున్నారనే వార్తలు గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయంటున్నారు. ఇప్పుడు బోయపాటి చేసిన కామెంట్లు ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. సెప్టెంబర్ 25న ఈ సినిమా రిలీజ్ కాబోతున్నట్టు ఇప్పటికే చిత్రబృందం ప్రకటించింది.

బాలకృష్ణ, బోయపాటి కాంబోలో వచ్చిన సినిమాల్లో అఖండ మూవీది ప్రత్యేక స్థానం. ఎందుకుంటే ఈ చిత్రంలో అఘోరా పాత్రలో బాలకృష్ణ యాక్టింగ్ అభిమానులనే కాదు ఆడియన్స్‌ని కూడా ఆకట్టుకుంది. అందుకే కరోనా తర్వాత రిలీజైన కూడా ఈ సినిమా థియేటర్లలో హౌస్‌ఫుల్ షోలతో భారీ కలెక్షన్లు రాబట్టింది. దీనికి కొనసాగింపుగా అఖండ2 వస్తోంది. నందమూరి తేజస్విని సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా కనిపించనున్నారు. అలాగే అఖండలో ఉన్న నటీనటులు చాలా మంది ఇందులో కంటిన్యూ కాబోతున్నారు.

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబో హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది. వీరి కాంబోలో తెరకెక్కిన సింహా, లెజెండ్, అఖండ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టాయి. ఇప్పుడు అఖండ2పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక బాలయ్య ఇటీవలే సంక్రాంతికి డాకు మహారాజ్ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశారు. ఇప్పుడు అఖండ2 ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి మరి.

Show Full Article
Print Article
Next Story
More Stories