Aha Video: అమెజాన్ ప్రైమ్ బాటలో వెళుతున్న ఆహా వీడియో

Aha OTT Follows the Amazon Prime
x

అమెజాన్ ప్రైమ్ ను ఫాలో అవుతున్న అహా (ఫైల్ ఇమేజ్)

Highlights

Aha Video: అమెజాన్ ప్రైమ్ వారిని ఫాలో అవుతున్న ఆహా

Aha Video: ఈ మధ్యకాలంలో ఓటీటీ హవా బాగానే నడుస్తుంది. ముఖ్యంగా ఆహా వీడియో వారు ఈ మధ్య కాలంలో తమ కంటెంట్తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇప్పటికే పలు సూపర్ హిట్ సినిమాలని స్ట్రీమ్ చేస్తున్నా ఆహా మరోవైపు ఈ మధ్యనే విడుదల బ్లాక్ బస్టర్ లైనా మరి కొన్ని సినిమాల రైట్స్ ను సొంతం చేసుకుంది. తాజా సమాచారం ప్రకారం లవ్ స్టోరీ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, గని, మరియు లక్ష్య సినిమాల డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకుంది ఆహా వీడియో. మరొక డిజిటల్ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వారు పే పర్ వ్యూ పాలసీని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే పాలసీని ఆహా కూడా తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట.

ఇప్పుడు సినిమాలు లేదా వెబ్ సిరీస్ డైరెక్ట్ గా ఆహా లో స్ట్రీమ్ అవుతాయి. దానికోసం ఆహా వారు నిర్మాతలకి వ్యూయర్ షిప్ ని బట్టి అమౌంట్ ఇస్తారు. దీనినే పే పర్ వ్యూ పాలసీ అంటారు. అయితే ఇది చిన్న చిన్న సినిమాలు మరియు వెబ్ సిరీస్ విషయంలో వర్కౌట్ అవుతుంది కానీ పెద్ద సినిమాల విషయంలో మాత్రం వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే డిజిటల్ రైట్స్ రూపంలో పెద్ద సినిమాలకి భారీ మొత్తంలో అమౌంట్ లభిస్తుంది. ఏదేమైనా ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్స్ మాత్రం ఈ పాలసీ ఒక మంచి ప్లాట్ఫామ్ ఇచ్చినట్లు అవుతుంది. అందుకే ఇప్పుడు ఆహా కూడా అమెజాన్ ప్రైమ్ బాటలోనే ముందుకు దూసుకు వెళుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories