కొత్త షూటింగ్ షెడ్యూల్ తో బిజీగా ఉన్న ఏజెంట్ బృందం

Agent Movie Team that Started the New Shooting Schedule | Tollywood News
x

కొత్త షూటింగ్ షెడ్యూల్ తో బిజీగా ఉన్న ఏజెంట్ బృందం

Highlights

*కొత్త షూటింగ్ షెడ్యూల్ తో బిజీగా ఉన్న ఏజెంట్ బృందం

Agent Movie: వరుస డిజాస్టర్ లతో సతమతమైన యువ హీరో అఖిల్ అక్కినేని తాజాగా "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్" తో పర్వాలేదనిపించారు. ఇక తాజాగా తన ఆశలన్నీ తన తదుపరి సినిమా "ఏజెంట్" పైనే పెట్టుకున్నారు అఖిల్. సైరా నరసింహారెడ్డి ఫేం సురేందర్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా ఒక స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఇక ఈ చిత్ర కొత్త షూటింగ్ షెడ్యూల్ వైజాగ్ లో ఈ మధ్యనే ప్రారంభమైంది. అఖిల్ తో పాటు కొందరు కీలక నటీనటులతో ఈ చిత్ర షూటింగ్ జరుగుతోంది. ఇక ఇంతకు ముందు ఎన్నడూ కనిపించినటువంటి యాక్షన్ సన్నివేశాలలో అఖిల్ ఈ సినిమాలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. యాక్షన్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అఖిల్ బోలెడు యాక్షన్ సన్నివేశాల్లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. కొత్త నటి సాక్షి వైద్య ఈ సినిమాలో హీరోయిన్ గా కనిపించనుంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి వక్కంతం వంశీ కథను అందించారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ హిప్ హాప్ తమీజా ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. రసూల్ ఎల్లూర్ ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories