ఏజెంట్ ని వాయిదా వేసిన "ది ఘోస్ట్"

Agent Movie Postponed For the Ghost Movie
x

ఏజెంట్ ని వాయిదా వేసిన "ది ఘోస్ట్"

Highlights

*ఏజెంట్ కి ఘోస్ట్ ని చూపించిన నాగార్జన

Tollywood: ఈ మధ్యనే "బంగార్రాజు" సినిమాతో మంచి హిట్ అందుకున్న టాలీవుడ్ కింగ్ నాగార్జున తాజాగా ఇప్పుడు ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో "ది ఘోస్ట్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. మరోవైపు నాగార్జున తనయుడు అక్కినేని అఖిల్ "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్" సినిమాతో తన కెరియర్ లోనే మొట్టమొదటి మంచి హిట్ ను అందుకున్నారు. తాజాగా ఇప్పుడు తన తదుపరి సినిమా ఏజెంట్ పైనే తన ఆశలన్నీ పెట్టుకున్నారు. ప్రముఖ డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఆగస్టు 12న విడుదల కావాల్సిన ఈ సినిమా ఇప్పుడు వాయిదా పడి డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకి రాబోతున్న సంగతి తెలిసిందే.

నిజానికి ఆగస్టు నుంచి సినిమా ఆలస్యం అవడానికి కారణం నాగర్జున. సినిమా చూసినా నాగార్జున విజువల్ ఎఫెక్ట్స్ బాలేదని గ్రాఫిక్స్ పై ఇంకా పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి మార్పులు చేశారు. మరోవైపు "ది ఘోస్ట్" సినిమా అక్టోబర్లో విడుదల కాబోతోంది. ఆసక్తికరంగా ఏజెంట్ మరియు ఘోస్ట్ రెండిటి కాన్సెప్ట్ ఒకటే. అయితే "ఘోస్ట్" సినిమాలో కంప్యూటర్ గ్రాఫిక్స్ చాలా బాగా వచ్చాయని అఖిల్ కి చూపించి ఏజెంట్ లో కూడా అంతే బాగా వస్తే బాగుంటుందని నాగార్జున చెప్పారట. రాజమౌళి, ప్రశాంత్ నీల్ వంటి స్టార్ డైరెక్టర్లు కూడా విజువల్ ఎఫెక్ట్స్ బాగా రావాలనే నిర్మాణాంతర పనులకు చాలా రోజులు కేటాయిస్తారు. ఇప్పుడు నాగార్జున కూడా అఖిల్ సినిమా విషయంలో ఇలాంటి మార్పులే చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories