కరోనా క్లైమాక్స్ సీన్ కోసం పెరిగిన ఆ మూవీ డౌన్‌లోడ్లు !

కరోనా క్లైమాక్స్ సీన్ కోసం పెరిగిన ఆ మూవీ డౌన్‌లోడ్లు !
x
Contagion Movie image
Highlights

ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కొవిడ్‌-19 మహమ్మారి కారణంగా 4వేలమందిపైగా చనిపోయారు. అయితే ఈ కరోనా కారణంగా 9ఏళ్ల క్రితం వచ్చి ఓ హాలీవుడ్ సినిమాకి ప్రస్తుతం విపరీతంగా డౌన్‌ లోడ్లు చేస్తున్నారు.

ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కొవిడ్‌-19 మహమ్మారి కారణంగా 4వేలమందిపైగా చనిపోయారు. అయితే ఈ కరోనా కారణంగా 9ఏళ్ల క్రితం వచ్చి ఓ హాలీవుడ్ సినిమాకి ప్రస్తుతం విపరీతంగా డౌన్‌ లోడ్లు చేస్తున్నారు. ఈ విషయాన్ని ఓ ఇంగ్లీష్ పత్రికలు వెల్లడించాయి. అమెరికన్‌ మెడికల్‌ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్రం పేరు 'కంటెజియన్‌'. మాట్‌ డామన్‌, జూడ్‌ లా, లారెన్స్‌ ఫిష్‌బర్న్‌, గ్వినేత్‌ పాల్ట్రో కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి స్టీవెన్‌ సోడర్‌బర్గ్‌ దర్శకత్వం వహించారు. 2011లో విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది.

అయితే ఈ సినిమా ఇటీవల ఎక్కువ మంది డౌన్ లోడ్లు చేయడానికి కారణం ఆ సినిమా కథే. ఈ సినిమాలోని కథ ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న పెద్ద సమస్య కరోనా వైరస్‌కు దగ్గరగా ఉండడం. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి పెరిగింది. దీంతో ఈ ఏడాది జనవరి నుంచి మార్చి మొదటి ఇప్పటి వరకూ డౌన్‌లోడ్లు క్రమంగా పెరిగాయి. అంతేకాకుండా కరోనా విజృంభణకు ముందు టాప్‌ 100 జాబితాలో 'కంటెజియన్‌' చిత్రం లేదని ఆంగ్ల పత్రికలు తెలిపాయి. దీంతోపాటు ఆస్ట్రేలియాలోని ఐట్యూన్స్‌ టాప్‌ 10 జాబితాతోపాటు 'కంటెజియన్‌' సినిమా అమెరికాలో టాప్ 20లో స్థానాన్ని కైవసం చేసుకుంది.

ఈ సినిమా కథ విషయానికి వస్తే బిజినెస్ నిమిత్తం బెత్‌ ఎమ్హాఫ్‌ అనే మహిళ హంగ్‌కాంగ్‌ వెళ్లి వస్తుంటుంది. అలాంటి హంగ్‌కాంగ్‌ నుంచి వచ్చిన కొన్నిరోజులకు బెత్‌ అనారోగ్యానికి గురై అపస్మారక స్థితిలోకి వెళ్తుంది. దీంతో ఆమె భర్త మిచ్‌ ఆస్పత్రికి తరలిస్తాడు. అప్పటికే చనిపోయిందని వైద్యులు చెబుతారు. కాకపోతే బెత్ మరణానికి గల కారణాన్ని వాళ్లు వైద్యులకు అంతుబట్టదు. అలా కొన్ని రోజుల తర్వాత బెత్‌ కొడుకు క్లార్క్‌ సైతం అలాంటి లక్షణాలతో చనిపోతాడు. కుటుంబంలోని ఇద్దరు వ్యక్తులు ఒకేలా చనిపోవడంతో వైద్యులు మిచ్‌ను ఐసోలేషన్‌లో ఉంచి పర్యవేక్షిస్తారు. మిచ్‌లో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉందని అతనికి సమస్య ఉండదని వైద్యులు నిర్ధారిస్తారు. కొన్ని రోజుల తర్వాత వైరస్‌ విపరీతంగా విజృంభిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మరణిస్తారు. దీంతో శాస్త్రవేత్తలు పందులు, గబ్బిలాల నుంచి ఈ వైరస్‌ వ్యాపించిందని గుర్తించి దానికి ముందు కనిపెడతారు.

'కంటెజియన్‌‌' చిత్రంలో కీలక పాత్రధారి గ్వినేత్‌ పాల్ట్రో ఇన్‌స్టా వేదికగా అభిమానులతో ఓ ఫోటో పంచుకుంది. పారిస్‌కు మాస్క్‌తో ప్రయాణించాల్సి వచ్చింది. ఇదంతా నేను నటించిన కంటెజియన్ చిత్రంలోలా ఉందని పోస్టు చేసింది. దీంతో నెటిజన్లు ఆ ఫోస్టులో వీపరింతా షేర్ చేశారు. దాని తర్వాత ఈ సినిమాను అనేక మంది వీక్షించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories