నన్ను సన్నీలియోని అని పిలిచేవారు అంటున్న అడవి శేష్

Adivi Shsh Spoke with Ali on Alitho Saradaga Show
x

నన్ను సన్నీలియోని అని పిలిచేవారు అంటున్న అడవి శేష్

Highlights

*నన్ను సన్నీలియోని అని పిలిచేవారు అంటున్న అడవి శేష్

Adivi Sesh: క్షణం, గూడాచారి, ఎవరు వంటి సినిమాలతో సూపర్ హిట్ లను అందుకొని మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఏర్పరుచుకున్నారు యువ హీరో అడవి శేష్. ఇక తాజాగా అడవి శేష్ హీరోగా "మేజర్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సాషి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 3న థియేటర్లలో విడుదల కాబోతుంది. ప్రస్తుతం అడవి శేష్ ఈ చిత్ర ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు ఈ నేపథ్యంలోనే కమెడియన్ అలీ హోస్ట్ గా వ్యవహరిస్తున్న "అలీతో సరదాగా" టాక్ షో కి వెళ్ళారు అడవి శేష్.

తాజాగా ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అడవి శేషు తన అసలు పేరు అడవి సన్నీ కృష్ణ అని చెప్పారు. తన స్నేహితులు తనను సన్నీలియోని అని పిలుస్తూ ఏడిపించే వాళ్ళని అందుకే తన పేరుని మార్చుకున్నట్లు గా చెప్పారు అడివి శేష్.

అంతేకాకుండా చందమామ సినిమాలో నవదీప్ పోషించిన పాత్ర తానే చేయాల్సి ఉందని రెండు రోజులపాటు షూటింగ్ పూర్తి చేశాక ఆ పాత్రకి తాను సెట్ అవ్వట్లేదు అని సినిమా నుంచి తీసేసారు అని చెప్పుకొచ్చారు అడవి శేష్. ఇక హాలీవుడ్ లో భారతీయులకి లీడ్ పాత్రలు ఇవ్వరని కేవలం చిన్న చిన్న పాత్రలు మాత్రమే ఇస్తారని అందుకే కరియర్ కోసం ఇండియా వచ్చేసినట్లు చెప్పారు అడవి శేష్.

Show Full Article
Print Article
Next Story
More Stories