Goodachari 2: గూడచారి 2 కోసం కొత్త డైరెక్టర్ ను రంగంలోకి దింపుతున్న అడవి శేష్

Adivi Sesh is Bringing in a New Director for Goodachari 2
x

Goodachari 2: గూడచారి 2 కోసం కొత్త డైరెక్టర్ ను రంగంలోకి దింపుతున్న అడవి శేష్

Highlights

Goodachari 2: అడవి శేష్ మరియు గూడచారి డైరెక్టర్ ల మధ్య క్రియేటివ్ విభేదాలు వచ్చాయా?

Goodachari 2: యువ హీరో అడవి శేష్ హీరోగా నటించిన "గూడచారి" సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఈ సినిమాకి సీక్వెల్ గా ఇప్పుడు "గూఢచారి 2" కూడా త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఈ సినిమా ని నిర్మించడానికి మూడు ప్రముఖ నిర్మాణ సంస్థలు చేతులు కలపబోతున్నాయి. ఈ సినిమాతో వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

గతంలో అడవి శేష్ నటించిన "మేజర్" సినిమాకి ఎడిటర్ గా పని చేసిన వినయ్ ఇప్పుడు ఈ సినిమాతో డైరెక్టర్ గా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. "మేజర్" సినిమాలో తన ఎడిటింగ్ బాగా నచ్చడంతో అడవి శేష్ స్వయంగా వినయ్ కి ఈ అవకాశాన్ని ఇచ్చినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే "గూడచారి" కి శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. ఆ తర్వాత అదే కాంబినేషన్లో వచ్చిన "మేజర్" కూడా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. నిజానికి ఈ రెండు సినిమాల వల్లే అడవి శేష్ కి పెద్ద సక్సెస్ వచ్చింది.

ఇక ఈ రెండు సినిమాల సక్సెస్ లో శశి కిరణ్ కీలక పాత్ర పోషించాడు. కానీ ఇప్పుడు అడవి శేష్ శశి కిరణ్ బదులుగా వేరే డైరెక్టర్ ని ఎందుకు ఎంచుకున్నాడు. శేష్ మరియు శశి కిరణ్ ల మధ్య ఏమైనా క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయా లేక కొత్త డైరెక్టర్ అయితే బాగుంటుందని అడవి శేష్ ఇలా ప్లాన్ చేస్తున్నాడా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. మరి అడవి శేష్ ఈ పుకార్లకు ఎప్పుడు చెక్ పెట్టి జవాబులు ఇస్తాడో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories