Decoyt Postponed: భారీ సినిమాల ఎఫెక్ట్.. రేస్‌కి బ్రేక్.. అడివి శేష్ డెకాయిట్ పోస్ట్‌పోన్


Decoyt Postponed: భారీ సినిమాల ఎఫెక్ట్.. రేస్‌కి బ్రేక్.. అడివి శేష్ డెకాయిట్ పోస్ట్‌పోన్
Decoyt Postponed: మార్చి 19న విడుదల కావాల్సిన అడివి శేష్, మృణాల్ ఠాకూర్ మూవీ డెకాయిట్ పోస్ట్‌పోన్ అయ్యింది. కొత్త రిలీజ్ డేట్ ఏప్రిల్ 10, 2026.
Decoyt Postponed: అడివి శేష్ అభిమానులకు నిరాశ కలిగించే వార్త ఇది. అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన రాబరీ థ్రిల్లర్ మూవీ ‘డెకాయిట్’ విడుదల వాయిదా పడింది. మొదట మార్చి 19, 2026న ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ నిర్ణయించారు. అయితే అదే తేదీన భారీ చిత్రాల పోటీ ఉండటంతో సినిమాను పోస్ట్‌పోన్ చేసినట్లు ప్రకటించారు.
మార్చి 19న రణ్‌వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్: ది రివెంజ్’ తో పాటు యష్ నటించిన ‘టాక్సిక్’ వంటి భారీ బడ్జెట్ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ బిగ్ క్లాష్ నేపథ్యంలో డెకాయిట్ చిత్రాన్ని ఆ రేస్ నుంచి తప్పించినట్లు మేకర్స్ స్పష్టం చేశారు.
డెకాయిట్ మూవీకి సంబంధించిన కొత్త రిలీజ్ డేట్‌ను కూడా అధికారికంగా వెల్లడించారు. ఈ సినిమాను ఏప్రిల్ 10, 2026న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు తెలిపారు.
డెబ్యూట్ డైరెక్టర్ షనీల్ డియో దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ మాజీ ప్రేమికులుగా కనిపించనున్నారు. కొన్ని అనుకోని పరిస్థితుల్లో వీరిద్దరూ కలిసి దొంగతనాలకు పాల్పడాల్సి వస్తుంది. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
డెకాయిట్ గురించి అడివి శేష్ ఇటీవల మాట్లాడుతూ.. ఇది ఆధునిక ‘షోలే’ తరహా కథ అని తెలిపారు. నవ్వు, కోపం, భావోద్వేగాలు అన్నీ కలగలిపిన సినిమా అని పేర్కొన్నారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



