Top
logo

'మల్లెమాల' దెబ్బకు 'అదిరింది' ఫట్! 'జబర్దస్త్' సూపర్ హిట్

Highlights

ఇంకేముంది జబర్దస్త్ పని అయిపొయింది. నాగబాబు బయటకు వచ్చేశారు. జబర్దస్త్ ఎవరు చూస్తారు. పైగా, అదిరింది అంటూ...

ఇంకేముంది జబర్దస్త్ పని అయిపొయింది. నాగబాబు బయటకు వచ్చేశారు. జబర్దస్త్ ఎవరు చూస్తారు. పైగా, అదిరింది అంటూ కొత్త షో నాగబాబు చేస్తున్నారు. ఇక ఎవరూ జబర్దస్త్ చూడరు. ఇలాంటి మాటలు విపరీతంగా విన్నాం కొన్నాళ్ల ముందు వరకూ. జబర్దస్త్ షో నుంచి న్యాయనిర్ణేతగా నాగబాబు తప్పుకోవడంతో ఇలా బోలెడన్ని వ్యాఖ్యానాలు వినిపించాయి. ఇక నాగబాబు అయితే, జబర్దస్త్ నుంచి బయటకు వచ్చి ఆ షో నిర్వాహకులపై తీవ్రంగా నోరుపారేసుకున్నారు కూడా. ఇక మాటలు లేవు..మాట్లాడుకోవడాలు లేవు అంటూ 'అదిరింది' షో మొదలు పెట్టేశారు.

ప్రతి ఆదివారమూ మిమ్మల్ని నవ్విస్తాం.. జబర్దస్త్ కంటే ఎక్కువగా అంటూ నాగబాబు చెప్పుకొచ్చారు. ఇక నాగబాబుతో పాటు జబర్దస్త్ నుంచి చమ్మక్ చంద్ర వంటి కమెడియన్లు.. ఆ షో దర్శక ద్వయం నితిన్ భరత్ లు కూడా జబర్దస్త్ కు టాటా చెప్పేశారు. దీంతో జబర్దస్త్ షో ను అదరగొట్టేస్తారు వీరంతా కల్సి అని భావించారు అందరూ. కానీ, అనుకున్నది ఒక్కటి.. అయినది ఒక్కటీ అన్న చందంగా తయారైంది నాగబాబు అండ్ కో పరిస్థితి. మొదటి ఎపిసోడ్ ఎలా ఉంటుందా అని చూసిన వీక్షకులు రెండో ఎపిసోడ్ కు ఆ మాత్రం కూడా ఆసక్తి చూపించలేదు. దీంతో అదిరింది షో కాస్తా ప్లేఆఫ్ షో గా నిలిచిపోయింది.

మల్లెమాల కౌంటర్!

ఎప్పుడైతే అదిరింది షో మొదలైందో వెంటనే.. జబర్దస్త్ టీమ్ అప్రమత్తమైంది. జబర్దస్త్ టీమ్ నుంచి ఎవరూ జారిపోకుండా జాగ్రత్త పడింది. అనసూయ తో సహా జబర్దస్త్ వదిలేస్తారని వార్తలు వచ్చిన ప్రతి ఒక్కరినీ విజయవంతంగా ఆపగలిగింది. ఇక్కడే మల్లెమాల తన మార్క్ చూపించిందని చెప్పొచ్చు. ఇక రెండో అడుగు సరిగ్గా జబర్దస్త్ కు ఉన్న బలాన్ని ఆదివారం అదిరింది షో వచ్చే సమయంలో చూపించింది. పాటు విజయవంతమైన స్కిట్లు దుమ్ముదులిపి వాటిన్నిటినీ ఒకదగ్గర పేర్చి ప్రత్యేక కార్యక్రమంగా ప్రసారం చేయడం మొదలు పెట్టింది. అంతే మూలీగే నక్క మీద తాటిపండు అన్నట్టు నాగబాబు షోకు చెక్ పడింది.

'అదిరింది' అంచనాలు ఎందుకు అందుకోలేదు?

నాగబాబు వేసిన అంచనాలు ఎక్కడ తప్పాయి అనేది విశ్లేషిస్తే.. మక్కీకి మక్కీ జబర్దస్త్ కార్యక్రమం లానే అదిరింది కూడా డిజైన్ చేయడం. సెట్స్..స్కిట్స్.. ఇలా ప్రతి అంశమూ జబర్దస్త్ కి నకిలీ లా కనిపిస్తున్నాయనేది ప్రేక్షకుల మాట. దాంతో కొత్తదనం లేని ఈ కార్యక్రమానికి సహజంగానే ఆదరణ తక్కువైంది. అన్నీ పాత ముఖాలే కావడం రెండో కారణం.. జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన వారితోనే షో ప్రారంభం అయినా.. కొత్త ముఖాల్ని కొందరినైనా తీసుకువస్తారని ప్రేక్షకులు భావించారు. కానీ, అలా జరగలేదు. ఇక మూడోది ఏంకర్. జబర్దస్త్ విషయంలో ఏంకర్ ల పాత్ర ఏమాత్రం తీసిపారేయలేనిది. గ్లామర్..యాంకరింగ్ రెండింటిలోనూ అనసూయ, రష్మీ గౌతమ్ లకు తిరుగులేదు.జబర్దస్త్ షో తో పరిచయం అయినా వీరిద్దరూ ఇప్పుడు జబర్దస్థ్కుక్ పెద్ద బలంగా మారారు. ఆ స్థాయి గ్లామర్ కానీ, యాంకరింగ్ మెళకువలు కానీ అదిరింది షో యాంకర్ సమీరాలో కనిపించలేదు. ముచ్చటగా ఈ మూడు ముఖ్య కారణాలూ ప్రేక్షకులాను ఆకట్టుకోవడంలో విఫలం అయ్యాయి. ఇక ఇవి కాకుండా స్కిట్ లు ఏమైనా కొత్తగా ఉన్నాయా అంటే అదీ లేదు, దీంతో అదిరింది కాస్తా వెనుక బడిపోయింది. ఎంత వెనుకబడిపోయిందంటే తాజా టీఆర్ఫీ రేటింగ్ లలో జీతెలుగు టాప్ 30 లో కూడా స్థానం దొరకనంత. అదే సమయంలో ఈటీవీ కార్యక్రమాల్లో జబర్దస్త్ మంచి టీఆర్ఫీ రేటింగ్స్ సంపాదించింది.

కొసమెరుపేమిటంటే.. ఈటీవీలో సరిగ్గా అదిరింది ప్రసారం అవుతున్న సమయంలో ప్రసారం అవుతున్న జబర్దస్త్ పాత స్కిట్ల కార్యక్రమానికి వస్తున్నా టీఆర్ఫీ రేటింగ్ ల కంటే అదిరింది రేటింగ్ లు మరింత తక్కువ ఉండటం!

Web TitleAdirindi show getting low TRP ratings comparatively to Jabardasth
Next Story


లైవ్ టీవి