Adipurush Update: ప్రభాస్ లేకుండానే ఆదిపురుష్ షూటింగ్

Adipurush Shoot to Resumes Without Prabhas
x

ఆదిపురుష్ మూవీ షూటింగ్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Adipurush Update: సలార్ షెడ్యూల్‌ను ముగించుకుని ఆదిపురుష్ షూటింగ్‌లో ప్రభాస్ జాయిన్ అవుతారని టాలీవుడ్ టాక్

Adipurush Update: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న సినిమా ఆదిపురుష్ అనే మైథలాజికల్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం దాదాపు 300 కోట్ల బడ్జెట్ కేటాయించారని తెలుస్తోంది. పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతోనన ఈ సినిమా ఇటు హిందీతో పాటు, తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళ, క‌న్న‌డ‌ భాష‌ల్లో విడుదలకానుంది. ఈ సినిమాను భూష‌ణ్ కుమార్ (టీ సిరీస్), ప్ర‌సాద్ సుతార్‌, రాజేశ్ నాయ‌ర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీ షూట్ ప్రారంభానికి ముందే సంచనాలు సృష్టిస్తోంది. ఈ ఎపిక్ పీరియడ్ యాక్షన్ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కోసం అవతార్, స్టార్ వార్స్ ఫేమ్ స్పెషలిస్టులను నిర్మాతలు సంప్రదించారని కథనాలు వెలువడుతున్నాయి.

ఇక ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే ఈ నెలలో నే షూటింగ్‌ను ముంబైలోని ఒక స్టూడియోలో మొదలుపెడతారట. రావణుడి పాత్ర చేస్తున్న సైఫ్ అలీఖాన్ మీద షూటింగ్ జరపనున్నారు. పూర్తిగా గ్రీన్ మ్యాట్ వేసి సిద్ధంచేసిన స్టూడియోలో షూటింగ్ జరుగనుంది. ఈ షెడ్యూల్‌ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీ వేసిన భారీ సెట్‌లో జరగనుంది. అయితే ఇందులో కూడ ప్రభాస్ పాల్గొన్నడం లేదని తెలుస్తోంది. ఈ రెండు షెడ్యూల్స్ ఆయన లేకుండానే జరుగుతాయట. ప్రభాస్ తప్ప ఇతర ముఖ్య తారాగణం ఇందులో పాల్గొంటారు.

ఈ గ్యాపులో మరోవైపు ప్రభాస్ 'సలార్' సినిమా షూటింగ్‌లో పాల్గోననున్నాడట. సలార్ షెడ్యూల్‌ను ముగించుకుని ఆదిపురుష్ షూటింగ్‌లో జాయిన్ అవుతారట. ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, కృషన్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా వచ్చే సంవత్సరం ఆగస్టు 11 న విడుదల కానుందని చిత్రబృందం తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories