"ఆది పురుష్" సినిమాని వాయిదా వేస్తారని ఫిక్స్ అయిన మైత్రి మూవీ మేకర్స్

Mythri Movie Makers: "ఆది పురుష్" విడుదల వాయిదా పడుతుందని నమ్ముతున్నారు.

Jyothi
Updated on: 23 Oct 2022 8:45 PM IST
Adipurush to be Postponed
X

"ఆది పురుష్" సినిమాని వాయిదా వేస్తారని ఫిక్స్ అయిన మైత్రి మూవీ మేకర్స్

Mythri Movie Makers: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న "ఆది పురుష్" సినిమా వచ్చే ఏడాది జనవరి 12న సంక్రాంతి సందర్భంగా విడుదల అవుతుందని దర్శక నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. కానీ ఈ సినిమా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు "ఆది పురుష్" సినిమా వాయిదా పడుతుందని బలంగా నమ్ముతున్నట్లు తెలుస్తోంది.

అందుకే మైత్రి వారు నిర్మిస్తున్న తమ రెండు సినిమాలను సంక్రాంతి బరిలోనే దింపడానికి సిద్ధమవుతున్నారు. అందులో ఒకటి మెగాస్టర్ చిరంజీవి నటిస్తున్న "వాల్తేరు వీరయ్య" కాగా మరొకటి నందమూరి బాలకృష్ణ నటిస్తున్న "వీరసింహారెడ్డి". కేఎస్ రవీంద్ర అలియాస్ బాబి దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న "వాల్తేరు వీరయ్య" సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 13న థియేటర్లలో విడుదల కాబోతోంది. మాస్ మహారాజ రవితేజ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. మరోవైపు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటిస్తున్న "వీర సింహారెడ్డి" సినిమా వచ్చే ఏడాది జనవరి 11న థియేటర్లలో విడుదల కి సిద్ధమవుతోంది.

మరోవైపు విజయ్ హీరోగా నటిస్తున్న మొట్టమొదటి తెలుగు సినిమా "వారసుడు" కూడా సంక్రాంతి బరిలోనే దిగనుంది. అయితే "ఆది పురుష్" సినిమా ఖచ్చితంగా వాయిదా పడుతుందని నమ్మకంతో మైత్రి మూవీ మేకర్స్ వారు తమ రెండు సినిమాలను సంక్రాంతికి విడుదల చేయడానికి సాహసం చేస్తున్నట్టు సమాచారం. ఇక మైత్రి వారు అనుకున్నట్లే జరిగే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తుంది.

Jyothi

Jyothi

Next Story