"హిట్ 2" సినిమాతో నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిన అడవి శేష్

* మొదటి రోజే బాక్స్ ఆఫీస్ వద్ద 8 కోట్ల కలెక్షన్లను అందుకుని తెలుగు రాష్ట్రాల్లోనే 6.5 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసుకుంది.

R Tripura Malini
Published on: 4 Dec 2022 10:10 AM IST
Adavi Sesh Went To The Next Level With The Film Hit 2
X

"హిట్ 2" సినిమాతో నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిన అడవి శేష్

Adivi Sesh: ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఇప్పుడు తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న హీరోలలో అడవి శేష్ కూడా ఒకరు. కేవలం స్క్రిప్ట్ సెలక్షన్ తో మంచి సినిమాలను మాత్రమే ఎంపిక చేసుకుంటూ తనదైన శైలి లో ప్రేక్షకులను అలరించడంలో ముందుంటాడు అడవి శేష్. అయితే నిన్న మొన్నటి వరకు బడ్జెట్ పరంగా పోల్చుకుంటే అడవి శేష్ రెండు లేదా మూడవ క్యాటగిరి హీరోల జాబితాలో ఉండేవాడు. కానీ తాజాగా అడవి శేష్ హీరోగా నటించిన "హిట్ 2" సినిమా మొదటి రోజే బాక్స్ ఆఫీస్ వద్ద 8 కోట్ల నెట్ కలెక్షన్లను అందుకుని కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే 6.5 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసుకుంది. మిగతా ఏరియా ల నుంచి ఒకటి నుంచి రెండు కోట్ల దాకా వసూళ్లు చేసిన ఈ సినిమా అమెరికా బాక్సాఫీస్ వద్ద 500 కే డాలర్లను వసూలు చేసింది.

ఈ నేపథ్యంలో "హిట్ 2" సినిమా మొదటి రోజే 42% థియేట్రికల్ రైట్స్ సేల్స్ ను రికవరీ చేసేసింది అని చెప్పుకోవాలి. ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ హిట్టు కచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అయితే స్టార్ హీరోయిన్ అయిన సమంత "యశోద" సినిమాకి మొదటి రోజు తెలుగు రాష్ట్రాల నుంచి మూడు కోట్లు కలెక్షన్లు రాగా అమెరికాలో 200 కే డాలర్లు వసూళ్లు అయ్యాయి. మరోవైపు విశ్వక్ సేన్ నటించిన "ఓరి దేవుడా" సినిమాకి మొదటి రోజున తెలుగు రాష్ట్రాల నుంచి 5.4 కోట్ల వసూళ్లు లభించాయి. ఇక "హిట్ 2" సినిమా వర్డ్ ఆఫ్ మౌత్ కూడా చాలా బాగుండడంతో వారంతం వరకు హిట్టు కలెక్షన్లు బాగానే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఈ సినిమా సూపర్ సక్సెస్ తో అడవి శేష్ ఇప్పుడు టైర్ 2 హీరోలలో ఒకరిగా మారిపోయారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story