Lucifer Movie Update: మెగాస్టార్ సోదరిగా బాలీవుడ్ భామ?

Lucifer Telugu Movie Update: మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించనున్న సినిమా 'లూసిఫర్'.

Venkata Chari
Published on: 5 Jun 2021 2:56 PM IST
Actress Vidya balan as Chiranjeevi Sister in Lucifer Telugu Movie
X

మెగాస్టార్ చిరంజీవి (ఫొటో ట్విట్టర్)

Lucifer Telugu Movie Update: మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించనున్న సినిమా 'లూసిఫర్'. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంటున్న ఈ సినిమాపై మెగాస్టార్ ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కరోనా పరిస్థితులతో షూటింగ్ ప్రారంభం కాలేదు. కాగా, ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో ఈ సినిమా పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. అయితే, తాజాగా ఈ సినిమాపై ఓ వార్త నెట్టింట్లో హల్‌చల్ చేస్తుంది.

తాజాగా మెగాస్టార్ చిరంజీవి సోదరి పాత్రలో బాలీవుడ్ లో తనదైన ముద్ర వేసిన విద్యాబాలన్‌ నటించనున్నట్లు టాక్. ఈమేరకు మేకర్స్ ఆమెన్ సంప్రదించినట్లు తెలుస్తోంది. విద్యాబాలన్.. బాలీవుడ్‌లో ఉమెన్‌ ఓరి‍యేంటడ్ సినిమాల్లో నటిస్తూ.. మంచి పేరు సంపాదించుకుంది. తన చేసే సినిమాలు, పాత్రలు చాలా విభిన్నంగా ఉంటాయి. అందుకే విద్యాబాలన్‌ను సంప్రదించినట్లు టాక్ వినిపిస్తోంది. కాగా, విద్యాబాలన్ నుంచి ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం రాలేదంట. పూర్తి వివరాలు తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సందే.

మోహన్‌రాజా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. కాగా, ప్రస్తుతం చిరంజీవి.. కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' సినిమా చేస్తున్నాడు. కరోనాతో ఈ షూటింగ్ ఆగోపోయింది. ఈ సినిమా పూర్తికాగానే 'లూసిఫర్' ని లైన్‌లో పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాలో నటుడు సత్యదేవ్‌ కీలక పాత్ర పోషించనున్నారు. ఈ సినిమాని ఎన్వీ ప్రసాద్‌, కొణిదెల ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Venkata Chari

Venkata Chari

Next Story