Tamannaah Bhatia: రెండు సార్లు హార్ట్‌ బ్రేక్‌ అయ్యింది.. ప్రేమ వ్యవహారంపై ఓపెన్‌ అయిన తమన్నా ..!

Tamannaah Bhatia
x

Tamannaah Bhatia: రెండు సార్లు హార్ట్‌ బ్రేక్‌ అయ్యింది.. ప్రేమ వ్యవహారంపై ఓపెన్‌ అయిన తమన్నా ..!

Highlights

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలో ఎదురైన అనుభవాల గురించి పంచుకున్న తమన్నా.

Tamannaah Bhatia: సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ప్రతీ ఒక్కరు ఏదో ఒక సమయంలో ప్రేమలో పడే ఉంటారు. బ్రేకప్‌లు కూడా సర్వసాధారణమే. అయితే బ్రేకప్‌ అంత సులభమైన విషయం అంత సులభమైంది కాదు. చాలా మంది డిప్రెషన్‌లోకి వెళ్తుంటారు. తాను కూడా ఇలాంటి అనుభవాన్నే ఎదుర్కొన్నాను అని చెబుతోంది. అందాల తార తమన్నా. ఒకటి కాదు రెండు సార్లు తన హార్ట్ బ్రేక్‌ అయ్యింది అంటూ ఆసక్తకర వ్యాఖ్యలు చేశారు.

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలో ఎదురైన అనుభవాల గురించి పంచుకున్న తమన్నా. బ్రేకప్‌ నిజంగా చాలా బాధాకరమని, అది అనుభవించిన వారికే తెలుస్తుందని చెప్పుకొచ్చింది. టీనేజ్‌లో ఉన్నప్పుడే తొలి హార్ట్ బ్రేక్‌ ఎదురైందని వ్యక్తిగత జీవితానికి సంబంధించి విషయాలను పంచుకుందీ బ్యూటీ. తాను టీనేజ్‌లో ఉన్నప్పుడే ప్రేమలో పడ్డానని.. అయితే అది సాగలేదని తెలిపింది. జీవితంలో ఏదో సాధించాలనే తపనతో ఉన్న తనకు ఒక వ్యక్తి కోసం జీవితాన్ని వదులుకోవాలనిపించలేదని అందుకే ఆ ప్రేమను వదులుకోవాల్సి వచ్చిందని తెలిపింది. ఆ తర్వాత మరో వ్యక్తితో ప్రేమలో పడ్డానని తెలిపిన తమన్నా.. ఆ ప్రేమ కూడా మధ్యలో ఆగిపోయిందని తెలిపింది.

రెండో ప్రేమ బ్రేకప్‌ కావడానికి గల కారణాన్ని వివరిస్తూ.. ప్రతి చిన్న విషయానికీ అబద్ధం ఆడే వ్యక్తితో కొనసాగలేననిపించే రెండో ప్రేమను వదులుకున్నట్లు తెలిపింది. ఇలా తన జీవితంలో ఎదురైన రెండు చేదు సంఘటనలను అభిమాలనుతో పంచుకుందీ బ్యూటీ. ఇదిలా ఉంటే తమన్నా ప్రస్తుతం.. నటుడు విజయ్‌ వర్మతో ప్రేమలో ఉన్నారన్న వార్త గత కొన్ని రోజులు వైరల్‌ అవుతున్న విషయం తెలిసిందే. అయితే పెళ్లిపై తమన్నా ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం చేయలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories