పవన్ ఎక్స్‌ప్రెషన్స్ అర్ధమయ్యేవి కావు .. సుప్రియ

పవన్ ఎక్స్‌ప్రెషన్స్ అర్ధమయ్యేవి కావు .. సుప్రియ
x
Highlights

హీరో పవన్ కళ్యాణ్ మరియు సుప్రియ జంటగా నటించిన సినిమా అక్కడ అమ్మాయి - ఇక్కడ అబ్బాయి .. ఈ సినిమాకి ఈవివి సత్యనారాయణ దర్శకుడు . మెగాస్టార్ తమ్ముడిగా...

హీరో పవన్ కళ్యాణ్ మరియు సుప్రియ జంటగా నటించిన సినిమా అక్కడ అమ్మాయి - ఇక్కడ అబ్బాయి .. ఈ సినిమాకి ఈవివి సత్యనారాయణ దర్శకుడు . మెగాస్టార్ తమ్ముడిగా అక్కినేని నాగేశ్వరరావు మనవరాలుగా ఇద్దరు తేరకి పరిచయం అయ్యారు . అప్పట్లో ఇదో సెన్సేషన్ అనే చెప్పాలి . ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది . అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన సుప్రియ ఓ ఇంటర్వ్యూ లో తన అనుభవాలను షేర్ చేసుకుంది .

సినిమా షూటింగ్ లో భాగంగా పవన్ కళ్యాణ్ నేను తరుచుగా గొడవ పడేవారిమని, అప్పట్లో హీరోలు పెద్ద పెద్ద జుట్టుతో గడ్డాలతో ఉండేవారని చెప్పుకొచ్చింది సుప్రియ.. అలాగే పవన్ ఉండడంతో అయన ఎక్స్‌ప్రెషన్స్ అర్ధం అయ్యేవి కాదని సుప్రియ అన్నారు . అ రకంగా అయనతో చాలా ఇబ్బంది పడ్డానని అన్నారు . ఇక సినిమాలో భాగంగా పవన్ చేతులపై కార్లు పోనివ్వడం చూసి చాలా భాదపడ్డానని కానీ పవన్ మాత్రం చాలా సిగ్గుపడేవారని అన్నారు .. ఈ సినిమా తర్వాత సుప్రియ మళ్ళీ చాలా రోజుల తరవాత గూడచారి సినిమాలో నటించారు .. ఈ మధ్య కాలంలో ఆమె అన్నపూర్ణ స్టూడియోస్ వ్యవహారాలను చూసుకున్నారు ..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories