Actress: కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టిన ఈ బ్యూటీ ఇప్పుడెలా ఉందో తెలుసా?

Actress: కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టిన ఈ బ్యూటీ ఇప్పుడెలా ఉందో తెలుసా?
x
Highlights

Richa Gangopadhyay: ఇండస్ట్రీకి చాలా మంది హీరోయిన్లు పరిచయమవుతుంటారు. కెరీర్‌ తొలినాళ్లలో వరుసగా విజయాలను అందుకునే బ్యూటీలు ఆ తర్వాత ఒక్కసారిగా కెరీర్‌కు దూరమవుతుంటారు.

Richa Gangopadhyay: ఇండస్ట్రీకి చాలా మంది హీరోయిన్లు పరిచయమవుతుంటారు. కెరీర్‌ తొలినాళ్లలో వరుసగా విజయాలను అందుకునే బ్యూటీలు ఆ తర్వాత ఒక్కసారిగా కెరీర్‌కు దూరమవుతుంటారు. అలాంటి చాలా మంది హీరోయిన్లు ఉన్నారు. కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలోనే వెండి తెరకు దూరమైన వారిలో అందాల తార రిచా గంగోపాధ్యాయ్‌ ఒకరు. 2010లో రానా హీరోగా వచ్చిన లీడర్‌ మూవీతో వెండి తెరకు పరిచయమైందీ బ్యూటీ. తొలి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపును సంపాదించుకుంది.

కాగా మిరపకాయ్‌ మూవీతో తొలి కమర్షియల్‌ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో ఇన్నొసెంట్‌ పాత్రలో కనిపిస్తూనే గ్లామర్‌ డోస్‌ను పెంచేసింది. ఇక ఆ తర్వాత పలు తమిళ, బెంగాళి చిత్రంలో నటించింది. ఇక సారొచ్చారు, మిర్చి వంటి బ్యాక్‌ టూ బ్యాక్‌ హిట్ మూవీస్‌లో నటించిన రిచా ఆ తర్వాత క్రమంగా సినిమాలకు దూరంగా మంది. 2013లో వచ్చి భాయ్‌ మూవీ తర్వాత ఈ బ్యూటీ మళ్లీ వెండి తెరపై కనిపించలేదు. కెరీర్‌ పీక్స్‌లో ఉన్న సమయంలోనే అనూహ్యంగా సినిమాలకు దూరమైంది.

ఓవైపు సినిమాల్లో ఉన్న సమయంలోనే రిచా వివాహం చేసుకుంది. స్నేహితుడు జో లాంగెల్లాను ప్రేమించి వివాహం చేసుకుంది 2019లో వీరి వివాహం జరిగింది. 2021లో వీరికి లూకా షాన్‌ లాంగెల్లా అనే బాబు జన్మించాడు. రిచా ప్రస్తుతం విదేశాల్లో సెటిల్‌ అయ్యింది. సినిమాలకు దూరంగా ఉంటున్నా సోషల్‌ మీడియా ద్వారా నిత్యం యాక్టివ్‌గా ఉంటుంది రిచా. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్‌ను ఎంజాయ్‌ చేస్తున్న ఈ బ్యూటీ.. తన వ్యక్తిగత వివరాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటోంది. ఇప్పటికీ ఏమాత్రం చెరగని అందంతో ఉంది రిచా. తాజాగా ఈ బ్యూటీ తన కుమారుడు భర్తతో దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేయగా వైరల్‌గా మారాయి.



Show Full Article
Print Article
Next Story
More Stories