Actress: సినిమా ఛాన్స్ ఇస్తాం, డేటింగ్‌ చేస్తావా అన్నారు.. బాంబ్‌ పేల్చిన మరో హీరోయిన్

Actress: సినిమా ఛాన్స్ ఇస్తాం, డేటింగ్‌ చేస్తావా అన్నారు.. బాంబ్‌ పేల్చిన మరో హీరోయిన్
x
Highlights

Actress: సినిమా ఇండస్ట్రీలో బాగా వినిపిస్తున్న పదం క్యాస్టింగ్‌ కౌచ్‌. సినిమా ఆఫర్ల ఇవ్వాలంటే దర్శకనిర్మాతలు తమను కాంప్రమైజ్‌ కావాలని అడిగినట్లు చాలా మంది హీరోయిన్లు బహిరంగంగానే మాట్లాడుతున్నారు.

Actress: సినిమా ఇండస్ట్రీలో బాగా వినిపిస్తున్న పదం క్యాస్టింగ్‌ కౌచ్‌. సినిమా ఆఫర్ల ఇవ్వాలంటే దర్శకనిర్మాతలు తమను కాంప్రమైజ్‌ కావాలని అడిగినట్లు చాలా మంది హీరోయిన్లు బహిరంగంగానే మాట్లాడుతున్నారు. హాలీవుడ్‌ నుంచి టాలీవుడ్‌ వరకు ఈ జాడ్యం వెంటాడుతూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా నటి సనమ్ శెట్టి చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చగా మారిన విషయం తెలిసిందే. సినిమా అవకాశాల కోసం వెళ్లే బెడ్ షేర్‌ చేసుకోమని కొందరు నిర్మాతలు అడిగారంటూ తీవ్ర ఆరోపణలు చేసింది. అయితే తాజాగా మరో హీరోయిన్‌ సైతం ఇలాంటి వ్యాఖ్యలు చేసి బాంబ్ పేల్చింది.

అందాల తార రెబా మోనికా సైతం తాను కూడా క్యాస్టింగ్ కౌచ్ బారిన పడ్డానని తెలిపింది. ఈ బ్యూటీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో చర్చకు దారి తీసింది. కన్నడ ఇండస్ట్రీ ద్వారా వెండి తెరకు పరిచయమైన ఈ బ్యూటీ తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. అక్టోబర్ 31 లేడీస్ నైట్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించిన చిన్నది ఆ తర్వాత సామజవరగమన సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది.

ఇదిలా ఉంటే కెరీర్‌ ప్రారంభంలో తనకు ఎదురైన చేతు అనుభవం గురించి మాట్లాడింది. తాను కూడా లైంగిక వేధింపుల బారిన పడ్డట్టు చెప్పుకొచ్చింది. ఆఫర్స్ కోసం వెతుకుతున్న సమయంలో కొంతమంది తనను కమిట్మెంట్ అడిగారని, మరికొందరైతే ఛాన్స్ ఇస్తాం డేటింగ్‌కు వస్తావా అన్నారని చెప్పుకొచ్చింది. ఇంకా ఆమె మాట్లాడుతూ.. కొంతమంది ఎలాంటి భయం లేకుండా అడిగేస్తారని వాపోయింది. మరి ఈ బ్యూటీ చేసిన వ్యాఖ్యలు ఎలాంటి కాంట్రవర్సీలకు దారి తీస్తాయో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories