తొలిసారి ఏఐ ఆధారిత ఆర్‌ఐవిట్‌నెస్‌ సిస్టం.. సికింద్రాబాద్‌ ఫర్టీ 9 సెంటర్‌లో ప్రారంభించిన సినీనటి ప్రణీత

Actress Pranitha inaugurated Ferty9 Centre at Secunderabad
x

తొలిసారి ఏఐ ఆధారిత ఆర్‌ఐవిట్‌నెస్‌ సిస్టం.. సికింద్రాబాద్‌ ఫర్టీ 9 సెంటర్‌లో ప్రారంభించిన సినీనటి ప్రణీత

Highlights

Pranitha: సరికొత్త పరిజ్ఞానంతో సంతాన సాఫల్యం

Pranitha: ఏఐ ఆధారిత ఆర్ ఐ విట్‌నెస్ సిస్టం వంటి సరికొత్త పరిజ్ఞానంతో సంతాన సాఫల్యం సులభతరమని ప్రముఖ సినీనటి ప్రణీత అన్నారు. సికింద్రాబాద్ ఫర్టీ 9 ఫర్టిలిటీ సెంటర్‌లో తొలిసారిగా ఏ ఐ ఆధారిత ఆర్ ఐ విట్‌నెస్ సిస్టంను సినీనటి ప్రణీత ప్రారంభించారు. మారుతున్న జీవన విధానం, వాతావరణంలో మార్పులు, వృత్తిపరమైన జీవితం, పెరిగిన ఒత్తిడి వంటివి పిల్లలు లేని సమస్య ప్రబలంగా ఉన్నాయని, ఆధునిక పద్ధతుల ద్వారా సులభతరంగా సంతాన సాఫల్యం పొందవచ్చని నటి ప్రణీత తెలిపారు.

సంతానం కోసం నిరీక్షిస్తున్న మహిళలను కృత్రిమ గర్భధారణ పద్ధతులు ఆడుకుంటున్నాయని...సంతాన లేమి సమస్యలతో బాధపడుతున్న సరికొత్త పరిజ్ఞానంతో వైద్య సేవలు అందిస్తున్నామని ఫర్టీ 9 ఫర్టిలిటీ సెంటర్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సి. జ్యోతి అన్నారు. వరల్డ్ ఐవీఎఫ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని, అడ్వాన్స్ ఐవీఎఫ్ పద్ధతులపై మహిళలకు 50 శాతం రాయితీని కల్పిస్తున్నట్లు డాక్టర్ సి. జ్యోతి వెల్లడించారు. ఈ అవకాశాన్ని ఫర్టీ 9 బ్రాంచ్‌లలో మహిళలు వినియోగించుకోవచ్చని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories