RRR: రెండవ పాటలో అలరించిన ఆర్ఆర్ఆర్ బ్యూటీ

RRR: ఆర్ ఆర్ ఆర్ హీరోయిన్ ఎక్స్ప్రెషన్ తోనే రికార్డ్ సృష్టిస్తోంది

admin1
Updated on: 11 Nov 2021 7:00 PM IST
Olivia Morris is Highlight to RRR Movie Second Song
X

నాటు నాటు ఆర్ఆర్ఆర్  పాటతో ప్రేక్షకులను అలరిస్తున్న ఒలీవియా మొర్రిస్ (ఫైల్ ఇమేజ్)

RRR: ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో ఆర్ఆర్ఆర్ కూడా ఒకటి. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటిస్తున్న ఈ మల్టీస్టారర్ సినిమాకి ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన రెండవ సింగల్ కి అన్నీ భాషల్లోనూ అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఈ పాట లో ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ వేసిన అదిరిపోయే స్టెప్పులు ప్రేక్షకులకు కనువిందు చేశాయి.

హాలీవుడ్ బ్యూటీ ఒలీవియా మోరిస్ ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటిదాకా ఈమెకు సంబంధించిన అప్డేట్ ఏమి దర్శక నిర్మాతలు విడుదల చేయలేదు. తాజాగా విడుదలైన "నాటు నాటు" సాంగ్ పాటలో ఈమె కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఎన్టీఆర్ మరియు రాంచరణ్ డాన్స్ చూసి షాక్ అయినట్లుగా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. ఇప్పుడు ఆర్ విడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పాటతో ఒలీవియా మోరిస్ కూడా ప్రేక్షకుల దృష్టిని బాగానే ఆకర్షించింది. ఇక ఈ సినిమాలో ఆమె పాత్ర ఎలా ఉండబోతోందన్న అనే విషయం తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

admin1

admin1

Next Story