Nivetha Thomas: ఆ పాత్రలో నటిస్తే తప్పేంటి.? నివేదా ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

Actress nivetha thomas about her character in 35 chinna katha kadu movie
x

Nivetha Thomas: ఆ పాత్రలో నటిస్తే తప్పేంటి.? నివేదా ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ 

Highlights

'35 చిన్న కథ కాదు' అనే సినిమా ద్వారా ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైందీ బ్యూటీ.

2016లో వచ్చిన జెంటిల్ మ్యాన్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అందాల తార నివేదా థామస్. తొలి చిత్రంతోనే ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేసిందీ చిన్నది. ఆ తర్వాత పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ. ఇటీవల మూవీస్‌ కాస్త గ్యాప్‌ ఇచ్చింది. ‘శాకిని డాకిని’ మూవీ తర్వాత మరో చిత్రంలో నటించలేదు. అయతే తాజాగా మరో కొత్త చిత్రంతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది.

'35 చిన్న కథ కాదు' అనే సినిమా ద్వారా ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైందీ బ్యూటీ. విశ్వదేవ్‌ ఆర్‌, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమాకు నందకిశోర్‌ ఇమాని దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి రానా నిర్మాతగా వ్యవహరిస్తుండడం విశేషం. తెలుగు, తమిళ్‌, మలయాళంలో చిత్రాన్ని విడుదల చేయనున్నారు. సెప్టెంబర్‌ 6వ తేదీన రిలీజ్‌ కానుంది. సినిమా విడుదల తేదీ దగ్గరపడుతోన్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రచారంలో వేగాన్ని పెంచింది. ఇందులో భాగంగానే తాజాగా నివేదా ఇంటర్వ్యూ ఇచ్చింది.

ఇందులో భాగంగా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సినిమాలో నివేదా తల్లి పాత్రలో నటిస్తోంది. ఇదే విషయమై అడగ్గా.. చిన్న తనంలోనే తల్లి పాత్రలో నటించడంపై మీ అభిప్రాయం చెప్పండి అనగా.. మన దేశంలో 20 ఏళ్లు దాటిన అమ్మాయిని అడిగే మొదటి ప్రశ్న ‘పెళ్లి ఎప్పుడు చేసుకుంటావ్‌?’. అలాంటప్పుడు నేను 20 ఏళ్లు దాటాక తల్లి పాత్ర పోషిస్తే తప్పేముంది అని అన్నారు. దీని ప్రభావం తర్వాత సినిమాలపై పడుతుందని ఆలోచించాను కానీ.. ప్రేక్షకులకు నేను అన్నిరకాల పాత్రలు చేస్తానని తెలియాలనే ఈ పాత్రకు ఓకే చెప్పినట్లు చెప్పుకొచ్చారు.

ఈ పాత్రకు నేను మాత్రమే న్యాయం చేయగలను అని దర్శకులు అనుకుంటే అది ప్రశంసతో సమాన్నారు. ఒకేతరహా పాత్రలు చేయాలని తాను అనుకోనని, సినిమా చూశాక తల్లి పాత్రలకు మాత్రమే నివేదా సరిపోతారు అని మీరు రాయకుండా ఉంటే చాలు అంటూ మీడియాను ఉద్దేశిస్తూ నవ్వుతు బదులిచ్చారు. ఇక ఈ సినిమా కోసం తిరుపతి యాసలో మాట్లాడేందుకు గాను శిక్షణ తీసుకున్నానని, నెల రోజుల పాటు ప్రతిరోజు ఉదయం ట్యూషన్‌ చెప్పారని నివేదా తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories