Nidhhi Agerwal: పవన్‌ కల్యాణ్‌ నుంచి అది నేర్చుకోవాల్సిందే.. అందాల తార ఆసక్తికర వ్యాఖ్యలు

Actress Nidhhi Agerwal Interesting Comments About Pawan Kalyan and Prabhas
x

Nidhhi Agerwal: పవన్‌ కల్యాణ్‌ నుంచి అది నేర్చుకోవాల్సిందే.. అందాల తార ఆసక్తికర వ్యాఖ్యలు

Highlights

Nidhhi Agerwal: 2018లో వచ్చిన సవ్యసాచి మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది అందాల తార నిధి అగర్వాల్‌.

Nidhhi Agerwal: 2018లో వచ్చిన సవ్యసాచి మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది అందాల తార నిధి అగర్వాల్‌. ఆ తర్వాత మిస్టర్‌ మజ్నూతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో వచ్చిన ఈస్మార్ట్‌ శంకర్‌ మూవీతో తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. అయితే ఆ తర్వాత నిధి అగర్వాల్‌ ఆశించిన స్థాయిలో విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది. తెలుగులో వచ్చిన హీరో, తమిళంలో వచ్చిన సినిమా బాక్సాఫీస్‌ వద్ద పరాజయాన్ని మూటగట్టుకుంది.

అయితే ప్రస్తుతం ‘హరిహర వీరమల్లు’, ‘ది రాజాసాబ్‌’తో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. రెండు చిత్రాలు కూడా భారీ బడ్జెట్‌తో అంచనాల నడుమ విడుదలవుతుండడంతో నిధి అగర్వాల్‌ కెరీర్‌ మలుపు తిరగడం ఖాయమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పవన్‌ కళ్యాణ్‌, ప్రభాస్‌లతో పని చేయడం తనకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది.

ఇక పవన్‌ కళ్యాణ్‌ గురించి మాట్లాడుతూ.. పవన్‌ సెట్స్‌లో ఉన్నప్పుడు ఎంతో ఏకాగ్రతతో ఉంటారని, యాక్షన్‌ చెప్పగానే పూర్తిగా లీనమవుతారని చెప్పుకొచ్చింది. చుట్టూ ఏం జరుగుతున్నా పవన్‌ పట్టించుకోరని, తన సన్నివేశంపై మాత్రమే దృష్టిపెడతారన్నారు. ఆ లక్షణాన్ని తాను కూడా అలవాటు చేసుకోవాలన్నారు. ఇక ప్రభాస్‌ ఎప్పుడూ ఫన్నీగా ఉంటారని తెలిపింది. ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు వస్తాయా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాని తెలిపింది.

ఇదిలా ఉంటే 2022లో విరామం తీసుకోవడానికి గల కారణాన్ని వివరిస్తూ.. 'నేను స్టార్‌ కిడ్‌ని కాదు. అలాగే నాకు సినిమా నేపథ్యం కూడా లేదు. నేను నటిగా మొదటిస్థానంలో ఉండడమే పెద్ద విషయం. సినిమాల్లో అవకాశాలు రావడమే నాకు విజయంతో సమానం. ఎక్కువ సినిమాలు చేయాలని అందరికీ ఉంటుంది. కానీ, నేను మాత్రం నమ్మకం ఉన్న కథలనే ఎంచుకుంటాను. అలాంటివాటిపై మాత్రమే దృష్టిపెడతాను. నేనేం హీరోను కాదు.. వరుసగా కమర్షియల్‌ సినిమాలు చేయడానికి. ఒకవేళ నేను వరుస సినిమాలు చేసినా నన్ను అలాంటి స్క్రిప్ట్‌లు ఎంచుకున్నందుకు విమర్శిస్తారు. అందుకే గొప్ప కథలను మాత్రమే ఎంచుకుంటున్నాను' అని చెప్పుకొచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories