Nayanthara: 'అంత డౌట్‌ ఉంటే నన్ను గిల్లి చూసుకోండి'.. ట్రోలింగ్‌పై నయన్‌ ఫైర్‌

Nayanthara: అంత డౌట్‌ ఉంటే నన్ను గిల్లి చూసుకోండి.. ట్రోలింగ్‌పై నయన్‌ ఫైర్‌
x
Highlights

Actress Nayanthara reacts about plastic surgery: సినీరంగంలో ఉన్న వారిపై ట్రోలింగ్స్‌ రావడం సర్వసాధారణమైన విషయం. ఎలాంటి ఆధారాలు లేకుండానే పుకార్లను...

Actress Nayanthara reacts about plastic surgery: సినీరంగంలో ఉన్న వారిపై ట్రోలింగ్స్‌ రావడం సర్వసాధారణమైన విషయం. ఎలాంటి ఆధారాలు లేకుండానే పుకార్లను పుట్టిస్తుంటారు. సోషల్‌ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇది మరింత ఎక్కువైంది. మరీ ముఖ్యంగా హీరోయిన్ల వ్యక్తిగత విషయాలకు సంబంధించి నిత్యం పుకార్లు షికార్లు చేస్తుంటాయి. హీరోయిన్ల విషయంలో వచ్చే ప్రధాన రుమార్స్‌లో ఒకటి ప్రేమకు సంబంధించినవి అయితే మరొకటి అందంగా కనిపించడం కోసం వాళ్లు ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకున్నారనే వార్తలు.

పలానా హీరోయిన్‌ ముక్కు బాగా కనిపించేందుకు ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకుందని, మరో హీరోయిన్‌ పెదవులకు సర్జరీ చేయించుకుందని ఇలా రకరకాల వార్తలు వస్తూనే ఉంటాయి. అయితే చాలా వరకు హీరోయిన్లు వీటిని లైట్ తీసుకుంటుంటారు. కానీ తాజాగా లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార మాత్రం ఇలాంటి వార్తలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తనదైన శైలిలో స్పందించింది.

ఏ పనిలేని వాళ్లే ఇలాంటి చెత్త వార్తలు సృష్టిస్తారని నయన్‌ మండిపడింది. గతంలో తనపై కూడా ఇలాంటి వార్తలే వచ్చాయని, ముఖంలో కాస్త మార్పు కనిపిస్తే ప్లాస్టిక్‌ సర్జరీ అనేస్తారని వాపోయింది. మేకప్‌ గురించి అవగాహన ఉన్నవాళ్లయితే ఇలాంటివి రాయరన్న నయనతార.. 'నా కనుబొమ్మలంటే నాకు చాలా ఇష్టం. సందర్భాన్ని బట్టి వాటి ఆకారం మారుస్తుంటాను. వాటికోసం ఎంతో సమయాన్ని వెచ్చిస్తుంటా. కనుబొమ్మల ఆకారం మారినప్పుడల్లా ముఖంలో మార్పు కనిపిస్తుంది. అది చూసి ప్లాస్టిక్‌ సర్జరీ అనేస్తారు' అని చెప్పుకొచ్చింది.

ఇక ముఖంలో మార్పులు రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయన్న నయనతార.. ఒక్కోసారి డైటింగ్‌ వల్ల బుగ్గలు లోపలికి వెళ్లినట్టు కనిపిస్తాయని, అయితే రెండుమూడురోజులు రెస్ట్‌ తీసుకొని బయటకొస్తే బుగ్గలు పెరిగినట్టు కనిపిస్తాయి. వాటికి కూడా ప్లాస్టిక్‌ సర్జరీ అనేస్తే ఎలా? అని ప్రశ్నించింది. అనుమానం ఉంటే తనను గిల్లి చూసుకోవాలని, తన శరీరంలో ఎక్కడా ప్లాస్టిక్‌ ఉండదని నవ్వుతూ చెప్పుకొచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories