Shah Rukh - Nayanthara : షారుక్ ఖాన్ "పటాన్" సినిమా షూటింగ్ లో నయనతార

షారుక్ ఖాన్ "పటాన్" సినిమా షూటింగ్ లో నయనతార (ఫైల్ ఫోటో)
* షారుక్ ఖాన్ సినిమా షూటింగ్లో జాయిన్ అయిన లేడీ సూపర్ స్టార్
Shah Rukh - Nayanthara : బాలీవుడ్ బాద్ షా గా పేరు తెచ్చుకున్న షారూఖ్ ఖాన్ "జీరో" సినిమాతో డిజాస్టర్ ను అందుకున్నారు. తర్వాత కొన్ని నెలలు సినిమాలకి దూరంగా ఉన్న షారుక్ ఖాన్ తాజాగా ఇప్పుడు "పటాన్" సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా మాత్రమే కాకుండా తమిళంలో స్టార్ దర్శకుడిగా ఎదిగిన అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు ఖాన్. భారీ బడ్జెట్తో నిర్మించబడుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం పూణేలో జరుగుతోంది. ఈ షెడ్యూల్ తర్వాత చిత్ర బృందం తదుపరి షెడ్యూల్ కోసం ముంబై కి వెళ్ళనుంది. అక్కడ పది రోజుల పాటు ఈ సినిమా షూటింగ్ జరగబోతోంది. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రియమణి ముంబై షెడ్యూల్ లో పాల్గొనబోతున్నారు.
షారుక్ ఖాన్ తో రొమాన్స్ చేయబోతున్న లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ తో పూణే లో బిజీగా ఉన్నారు. షారుక్ ఈ సినిమాలో డబల్ రోల్ లో కనిపించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. నార్త్ మరియు సౌత్ ఇండస్ట్రీ లో నుంచి స్టార్ నటీనటులు ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. సన్యా మల్హోత్రా మరియు సునీల్ గ్రోవర్ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలు పోషించబోతున్నారు. టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా తర్వాత షారుక్ ఖాన్ దర్శకుడు రాజ్ కుమార్ హిరాని దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనుంది.
TS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల..
12 Aug 2022 6:14 AM GMTప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMT
మునుగోడులో హై వోల్టేజ్ రాజకీయాలు
13 Aug 2022 3:45 AM GMTMilk Facts: పాలు తాగితే బరువు పెరుగుతారా.. తగ్గుతారా..!
13 Aug 2022 3:17 AM GMTకాంగ్రెస్‌లో ఆపరేషన్ మునుగోడు ప్రారంభం
13 Aug 2022 2:32 AM GMTఅక్కపై తమ్ముడి విలువైన ప్రేమ
13 Aug 2022 2:04 AM GMTమునుగోడుపై బీజేపీ యాక్షన్ ప్లాన్
13 Aug 2022 1:47 AM GMT