వివాదంలో నయనతార కొత్త సినిమా

వివాదంలో నయనతార కొత్త సినిమా
x
Highlights

నయనతార కొత్త సినిమా వివాదంలో చిక్కుకుంది. సినిమాలో ఓ వర్గం మనోభావాలు కించపరిచారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమిళంలో ముకుత్తి అమ్మన్ అనే సినిమాలో అమ్మవారి పాత్రలో నయనతార నటిస్తుంది.

నయనతార కొత్త సినిమా వివాదంలో చిక్కుకుంది. సినిమాలో ఓ వర్గం మనోభావాలు కించపరిచారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమిళంలో ముకుత్తి అమ్మన్ అనే సినిమాలో అమ్మవారి పాత్రలో నయనతార నటిస్తుంది. ఇదే సినిమా తెలుగులో అమ్మోరు తల్లిగా వస్తుంది. ఈ సినిమాలో నయనతార వేసిన పాత్ర ద్వారా కొన్ని వర్గాల ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని.. వెంటనే ఆ సీన్‌లను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకి ఎన్‌జె శ‌రవ‌ణ‌న్‌, ఆర్జే బాలాజీ‌ దర్శకత్వం వహించారు. ఇశారి కె గ‌ణేష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి గిరీశ్ సంగీతం స‌మ‌కూర్చారు. ద‌స‌రా సంద‌ర్భంగా ఈ సినిమా ట్రైల‌ర్‌ను హీరో మ‌హేశ్‌బాబు విడుద‌ల చేశారు. ఈ చిత్రం దీపావ‌ళి కానుక‌గా న‌వంబ‌ర్ 14న డిస్నీ హాట్‌స్టార్‌లో విడుద‌ల కానుంది

Show Full Article
Print Article
Next Story
More Stories