logo
సినిమా

HBD Namitha: బొద్దుగుమ్మకు గుడి క‌ట్టిన అభిమానం

Actress Namitha Birthday Special Story
X
నటి నమిత (ఫైల్ ఇమేజ్)
Highlights

Actress Namitha: నమిత బాలకృష్ణతో చేసిన సింహా సూప‌ర్ హిట్ సాధించింది.

Actress Namitha: ఏ హీరోయిన్ అయినా ఇండ‌స్ట్రీలో హిట్ కోసం ఎదురుచూస్తారు. హిట్ వ‌స్తే వ‌రుస సినిమాలు అందుకుంటారు. కాస్తో కూస్తే స్టార్ డ‌మ్ సంపాదించుకొని.. దీపం ఉండ‌గానే ఇళ్ళు చ‌క్క‌బెట్టుకోవాల‌నేలా చూస్తారు. అయితే బొద్దుగుమ్మ అందుకు వ్య‌తిరేకం. బాలకృష్ణతో చేసిన సింహా సూప‌ర్ హిట్ సాధించింది. అందులో బాల‌య్య‌లో క‌లిసి ఆడిపాడిన‌ నమితపై తెలుగు ప్రేక్ష‌కుల్లో అభిమానం మ‌రింత పెరిగింది. అయితే వ‌రుస సినిమా ఆఫ‌ర్లు వ‌చ్చిన నమిత సినిమాల‌కు దూరంగా వెళ్లింది. ఆ త‌ర్వాత సినిమాల్లో క‌నిపించ‌లేదు. నేడు(మే 10) నమిత పుట్టిన రోజు. ఈ సందర్భంగా న‌మిత గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం..ఒక్క బాలయ్యతోనేనా విక్టరీ వెంకటేష్‌, మాస్‌ మహారాజ రవితేజతో సహా పలు హీరోలతోనూ నటించి మెప్పించింది. కానీ తెలుగులో కన్నా కూడా తమిళంలోనే ఆమెకు ఎక్కువ గుర్తింపు లభించింది. ఆ తర్వాత 'సొంతం' సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. విక్టరీ వెంకటేశ్ స‌ర‌స‌న 'జెమినీ' మూవీలో న‌టిచింది. ఆ సినిమాలో న‌మిత న‌ట‌న‌కు మంచి మార్కులు ప‌డ్డాయి. దీంతో 'ఒక రాధ ఇద్దరు కృష్ణుల పెళ్లి', 'నాయకుడు' వంటి పలు చిత్రాల్లో అవ‌కాశం వ‌రించింది.

1980 మే 10న గుజరాత్‌లోని సూరత్‌ పట్టణంలో జ‌న్మించిన నమిత. 1998లో మిస్‌ సూరత్‌ కిరీటాన్ని దక్కించుకుంది. 2001లో మిస్‌ ఇండియా పోటీల్లో 4వ స్థానంలో నిలిచింది 2017లో వీరేంద్ర చౌదరిని లవ్‌ మ్యారేజ్‌ చేసుకుని వైవాహిక జీవితానికి ఆరంభం పలికింది నమిత.. కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ పేరు ప్రఖ్యాతులు గడించింది. అయితే సడన్‌గా బొద్దుగా మారిపోవడం వల్లే సినిమాల్లో కనిపించకుండా పోయిందన్న వార్తలు వినిపించాయి. కొ్ంత కాలానికి సెకండ్‌ ఇన్నింగ్స్ మొద‌లు పెట్టింది. ప్రభాస్‌ 'బిల్లా' సినిమాలో సెకండ్‌ హీరోయిన్‌గా నటించింది. కానీ ఆ తర్వాత ఆఫర్లు రాకపోవడంతో సినిమాల్లో కనిపించనేలేదు.

అయితే ఈ బొద్దుగుమ్మ‌కి త‌మిళనాడులో ఫాలోయింగ్ పెరిగిపోయింది. అక్క‌డ న‌మిత‌కు గుడిక‌ట్టేంతగా అభిమానుల‌ను సంపాదించుకుంది. అంతేందుకు న‌మిత‌ను ఏకంగా కిడ్నాప్ చేయాల‌ని ఓ అభిమాని ప్ర‌య‌త్నించాడు. ఆమెను ఫంక్షన్‌కు తీసుకువెళ్లాల్సిన కారు డ్రైవర్‌ను తానే అని చెప్పడంతో... గుడ్డిగా నమ్మేసిన నమిత కారెక్కింది. కానీ నిజమైన కారు డ్రైవర్‌ ఈ ఫంక్షన్‌ నిర్వాహకులకు చెప్పడంతో ఆ కారును పట్టుకున్నారు. ఆ వ్య‌క్తిని పోలీసుపొంతన లేని సమాధానాలు చెప్పాడు.న‌మిత‌కు ప్ర‌స్తుతం సినిమాలు లేవు. వ్యాపార రంగంవైపు మొగ్గు చూపుతోంది. సినిమాల‌పై ప్రేమ‌తో ఇటీవలే కొత్తగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను కూడా ప్రారంభించిన విషయం తెలిసిందే. రాజ‌కీయాల్లోనూ న‌మిత యాక్టీవ్ గానే ఉంటుంది. బీజేపీలో చేరిన న‌మిత ఆపార్టీ క్రీయాశీల‌క కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటుంది.

Web TitleActress Namitha Birthday Special Story
Next Story