Madhavi Latha: జేసీ ప్రభాకర్ రెడ్డిపై మా అసోసియేషన్ కు మాధవీలత ఫిర్యాదు

Actress Madhavi Latha Complaint on JC Prabhakar Reddy
x

Madhavi Latha: జేసీ ప్రభాకర్ రెడ్డిపై మా అసోసియేషన్ కు మాధవీలత ఫిర్యాదు

Highlights

Madhavi Latha: జేసీ ప్రభాకర్ రెడ్డిపై నటి మాధవిలత తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కు, మా అసోసియేషన్ కు శనివారం ఫిర్యాదు చేశారు.

Madhavi Latha: జేసీ ప్రభాకర్ రెడ్డిపై నటి మాధవిలత తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కు, మా అసోసియేషన్ కు శనివారం ఫిర్యాదు చేశారు. జనవరి 1 ఈవెంట్ విషయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి తనపై అసభ్యంగా మాట్లాడారని ఆమె ఆ ఫిర్యాదులో చెప్పారు. తనపై జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సినీ పరిశ్రమ స్పందించినందున ఫిర్యాదు చేస్తున్నట్టుగా ఆమె చెప్పారు. తనపై జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై న్యాయ పోరాటం చేస్తానని ఆమె తెలిపారు. మాధవీలత ఫిర్యాదుపై అసోసియేషన్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మా అసోసియేషన్ ట్రెజరర్ శివ బాలాజీ చెప్పారు.

కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని తాడిపత్రిలో మహిళల కోసం జేసీ ప్రభాకర్ రెడ్డి సెలబ్రేషన్స్ నిర్వహించారు. మహిళల కోసమే కొత్త సంవత్సర వేడుకల నిర్వహణ ఏంటని మాధవీలత మండిపడ్డారు. ఈవెంట్ కు వెళ్లే మహిళలు జాగ్రత్తగా ఉండాలని ఆమె కోరారు. మాధవీలతకు మద్దతుగా బీజేపీ నాయకురాలు సాధినేని యామిని శర్మ కూడా మాట్లాడారు. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు కొత్త సంవత్సర వేడుకలా అంటూ ఆమె మండిపడ్డారు. జేసీ ప్రభాకర్ రెడ్డి తీరును విమర్శించారు. ఈవెంట్ కు భారీ ఎత్తున మహిళలు హాజరయ్యారు. ఈవెంట్ కు రావొద్దని మాధవీలత, యామిని వ్యాఖ్యలు చేయడంపై ఆయన మండిపడ్డారు. మాధవీలతపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత రెండు రోజులకు ఆయన ఈ వ్యాఖ్యలకు మాధవీలతను క్షమాపణలు కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories