పవన్ కి జోడిగా అందాలరాక్షసి?

పవన్ కి జోడిగా అందాలరాక్షసి?
x
lavanya tripathi, Pawan kalyan(File photo)
Highlights

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీగా తెరకెక్కుతున్న తాజా చిత్రం 'వకీల్ సాబ్'.. ఇది పవన్ కి 26 వ చిత్రం.. హిందీలో వచ్చిన పింక్ సినిమాకి ఇది రీమేక్ .

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీగా తెరకెక్కుతున్న తాజా చిత్రం 'వకీల్ సాబ్'.. ఇది పవన్ కి 26 వ చిత్రం.. హిందీలో వచ్చిన పింక్ సినిమాకి ఇది రీమేక్ ..ఇందులో అంజలి, నివేతా థామస్, అనన్య పాండే ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి ఓ మై ఫ్రెండ్ ఫేం వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా, బోనీ క‌పూర్‌, దిల్ రాజుకలిసి సంయుక్తంగా సినిమాని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు..ప్రస్తుతం శేరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాని మే 15న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా రిలీజ్ చేసిన సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, ఫస్ట్ సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

అయితే ఈ సినిమాలో పవన్ పక్కన నటించే హీరోయిన్ ఎవరు అన్నది ఆసక్తికరంగా మారింది. అందులో భాగంగా ఇప్పటికే పలువురు పేర్లు ప్రముఖంగా వినిపించాయి.. శృతిహాసన్, ఇలియానా పేర్లు బయటకు వచ్చాయి కానీ దీనిపైన చిత్ర బృందం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా ఇప్పుడు ఈ లిస్టు లోకి మరో భామ చేరిపోయింది. అందాలరాక్షసి సినిమాతో హీరోయిన్ గా ఆకట్టుకున్న లావణ్య త్రిపాఠిని చిత్రబృందం ఎంపిక చేసిందని, త్వరలో ఆమె షూటింగ్ లో పాల్గొననుందని తెలుస్తోంది. ఒరిజినల్ కథ ప్రకారం పవన్ ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే సన్నివేశంలో పవన్ భార్యగా లావణ్య కనిపించనుందని తెలుస్తోంది.

ఇక వకీల్ సాబ్ సినిమా తరవాత పవన్ వరుసపెట్టి సినిమాలు చేసేందుకు సిద్దం అయ్యారు. ఇప్పటికే క్రిష్ డైరెక్షన్లో ఓ సినిమాని పవన్ లైన్ లో పెట్టారు. ప్రస్తుతం ఈ సినిమా కూడా శేరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఎఎం రత్నం ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక దీని తర్వాత పవన్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇక పూరి, త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాలు చేసేందుకు పవన్ సిద్దం అయ్యారని తెలుస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories