Kriti Sanon: దయచేసి అలా రాయకండి, నాకు ఓ కుటుంబం ఉంది: కృతి సనన్

Actress kriti sanon opens about rumours on her dating news
x

 Kriti Sanon: దయచేసి అలా రాయకండి, నాకు ఓ కుటుంబం ఉంది: కృతి సనన్

Highlights

Kriti Sanon: తాను ఏకాకిని కాదని, తనకూ ఓ కుటుంబం ఉందని.. తనపై తప్పుడు వార్తలు రాస్తే అది కుటుంబం మొత్తాన్ని బాధిస్తుందని ఆవేదన వ్యక్తం చేసింది కృతి.

Kriti Sanon: సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలకు సంబంధించి అభిమానుల్లో ఆసక్తి ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ ఆసక్తిని ఆసరాగా తీసుకొని కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తుంటారు. మరి ముఖ్యంగా సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ఈ తప్పుడు ప్రచారాలు మరింత పెరిగాయి. ఫలానా హీరోయిన్ ఫలానా హీరోతో డేటింగ్ తో ఉందంటూ, త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోంది అన్నట్టు వార్తలు షికారు చేస్తూనే ఉంటాయి. అయితే వీటిపై కొందరు స్పందిస్తారు, మరికొందరు నవ్వి వదిలేస్తారు.

కానీ ఇలాంటి రూమర్స్ తమ జీవితాలపై ఎంతగానో ప్రభావం చూపుతాయని అంటోంది అందాల తార కృతి సనన్. గత కొన్ని రోజులుగా ఓ వ్యక్తితో డేటింగ్ లో ఉందంటూ వస్తున్న వార్తలపై కృతి తాజాగా స్పందించింది. ఆ వార్తలు ఏమాత్రం నిజం లేదంటూ, ఒకింత అసహనానికి గురైంది.

తాను ఏకాకిని కాదని, తనకూ ఓ కుటుంబం ఉందని.. తనపై తప్పుడు వార్తలు రాస్తే అది కుటుంబం మొత్తాన్ని బాధిస్తుందని ఆవేదన వ్యక్తం చేసింది కృతి.ఇలాంటి వార్తల దుష్ప్రభావాలు, తమ కుటుంబమంతా భరించాల్సి వస్తుందని దయచేసి అలాంటి వార్తలు రాయొద్దంటూ ఎమోషనల్ అయింది కృతి.

యూకేకు చెందిన కబీర్ బహియాతో కృతి డేటింగ్లో ఉన్నదంటూ, పైగా అతను కృతి కంటే పదేండ్లు చిన్నవాడంటూ వచ్చిన వార్తలపై తనదైన శైలిలో స్పందించింది. సోషల్ మీడియా వచ్చాక ఎలాంటి వార్త అయినా క్షణాల్లో జనాల్లోకి వెళ్లిపోతున్నది. అవి నిజాలైతే పర్లేదు. అబద్ధాలను వండి వారుస్తున్నారు. వాటినే నిజమని భావించి ఎంతోమంది నాకు మెసేజ్లు చేస్తున్నారు. అబద్ధాలపై స్పందించాలంటే చిరాగ్గా ఉందని ఆవేదన వ్యక్తం చేసింది.

‘34ఏళ్ల కృతి తన కంటే పదేండ్లు చిన్న వ్యక్తితో డేటింగ్’ అని హెడ్డింగులు పెట్టేసి రాస్తున్నారు. దీనిపై ఆన్లైన్లో ఎవరికి నచ్చినట్టు వాళ్లు కామెంట్స్ చేసేస్తున్నారు. ఇది ఓ ట్రెండ్ అయిపోయింది. అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తపరచడం, అవతలివారిపై గాలివార్తలు రాయడం.. రెండూ ఒకటి కాదు. అది గ్రహించండి’ అంటూ తీవ్ర అసహనానికి గురైంది. ఏది ఏమైనా తన పెళ్లి విషయమై వస్తున్న పుకార్లకు చెక్ పెట్టిందీ చిన్నది.

Show Full Article
Print Article
Next Story
More Stories