Divorce: అవును మేమిద్దరం విడాకులు తీసుకున్నాం.. క్లారిటీ ఇచ్చిన బుల్లితెర బ్యూటీ..!

Divorce: అవును మేమిద్దరం విడాకులు తీసుకున్నాం.. క్లారిటీ ఇచ్చిన బుల్లితెర బ్యూటీ..!
x
Highlights

Divorce: సినిమా, సీరియల్ ప్రపంచంలో ఎప్పుడు ఏ శుభవార్త వింటామో.. ఏ షాకింగ్ న్యూస్ వింటామో అర్థం కాని పరిస్థితి నెలకొంది.

Divorce: సినిమా, సీరియల్ ప్రపంచంలో ఎప్పుడు ఏ శుభవార్త వింటామో.. ఏ షాకింగ్ న్యూస్ వింటామో అర్థం కాని పరిస్థితి నెలకొంది. తాజాగా బుల్లితెర ప్రేక్షకులకు గట్టి షాక్ ఇస్తూ, పాపులర్ సీరియల్ నటి అనూష హెగ్డే తన వైవాహిక బంధానికి స్వస్తి పలికారు. మూడేళ్ల క్రితం ఎంతో అట్టహాసంగా జరిగిన ఆమె వివాహం, ఇప్పుడు విడాకులతో ముగియడం చర్చనీయాంశమైంది.

కన్నడ నటి అనూష హెగ్డే, తెలుగులో 'నిన్నే పెళ్లాడుతా', 'సూర్యకాంతం', 'ఆనంద రాగం' వంటి సీరియల్స్‌తో డైనమిక్ నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 'నిన్నే పెళ్లాడుతా' షూటింగ్ సెట్స్‌లో నటుడు ప్రతాప్ సింగ్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. 2019లో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట, 2021 ఫిబ్రవరి 12న కుటుంబ సభ్యుల సమక్షంలో వైభవంగా వివాహం చేసుకున్నారు. అప్పట్లో వీరిద్దరి జోడీ చూడముచ్చటగా ఉందని అభిమానులు మురిసిపోయారు.

గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య మనస్పర్థలు ఉన్నాయని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నప్పటికీ, తాజాగా అనూష అధికారికంగా స్పందిస్తూ విడాకుల విషయాన్ని ధృవీకరించారు. ప్రతాప్ సింగ్‌తో నా వైవాహిక జీవితం ముగిసింది. మేమిద్దరం కలిసి చర్చించుకుని, పరస్పర అంగీకారంతోనే విడిపోవాలని నిర్ణయించుకున్నాం. 2025లో మాకు చట్టబద్ధంగా విడాకులు లభించాయి. ఇది మా వ్యక్తిగత నిర్ణయం. దయచేసి మా ప్రైవసీని గౌరవించండి, అనవసరమైన ఊహాగానాలు చేయకండి అని ఆమె స్పష్టం చేశారు.

వ్యక్తిగత జీవితంలో ఒడుదొడుకులు ఎదురైనప్పటికీ, వృత్తిపరంగా అనూష దూసుకుపోతున్నారు. గతంలో 'సూర్యకాంతం' సీరియల్‌లో డీసీపీగా పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చి 'జీ తెలుగు కుటుంబ అవార్డు' అందుకున్న ఆమె, ప్రస్తుతం కన్నడ సీరియల్ 'అనుపల్లవి'లో ఐఏఎస్ ఆఫీసర్‌గా రాణిస్తున్నారు. విడాకుల బాధ నుంచి కోలుకుని, తన ప్రొఫెషనల్ లైఫ్‌ను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని ఆమె నిర్ణయించుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories