TVK Congress Alliance: "కాంగ్రెస్ మా సహజ మిత్రుడు".. టీవీకే–హస్తం పొత్తుపై విజయ్ పార్టీ సంకేతాలు

TVK Congress Alliance: కాంగ్రెస్ మా సహజ మిత్రుడు.. టీవీకే–హస్తం పొత్తుపై విజయ్ పార్టీ సంకేతాలు
x

TVK Congress Alliance: "కాంగ్రెస్ మా సహజ మిత్రుడు".. టీవీకే–హస్తం పొత్తుపై విజయ్ పార్టీ సంకేతాలు

Highlights

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం. కాంగ్రెస్‌తో టీవీకే సహజ మిత్రత్వంపై విజయ్ పార్టీ నేత వ్యాఖ్యలు. రాబోయే ఎన్నికల ముందు పొత్తుపై చర్చలు మళ్లీ మొదలయ్యాయి.

తమిళనాడు నటుడు మరియు రాజకీయ నాయకుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునే అవకాశాలపై మరోసారి చర్చ మొదలైంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ, టీవీకే జాతీయ ప్రతినిధి ఫెలిక్స్ గెరాల్డ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతున్నాయి.

టీవీకే ఎవరి‌తో పొత్తు పెట్టుకుంటుందన్న అంశంపై జరుగుతున్న ఊహాగానాల మధ్య ఫెలిక్స్ మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ మరియు టీవీకే సహజ మిత్రపక్షాలుగా పేర్కొన్నారు. లౌకికవాదం, మతతత్వానికి వ్యతిరేకంగా ఇరు పార్టీల వైఖరి ఒకే దిశలో ఉందని తెలిపారు. ఈ కారణంగా కాంగ్రెస్‌తో కలిసి పనిచేసే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, టీవీకే అధినేత విజయ్ మధ్య స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయని వెల్లడించారు.

అయితే, పొత్తు అంశం అంత సులభం కాదని, ఏదైనా ఒప్పందానికి రావాలంటే ముందుగా కొన్ని సమస్యలను పరిష్కరించుకోవాల్సి ఉంటుందని ఫెలిక్స్ స్పష్టం చేశారు. ముఖ్యంగా తమిళనాడు కాంగ్రెస్ కమిటీ నాయకత్వంలోని వ్యక్తిగత ప్రయోజనాలే చర్చలకు అడ్డంకిగా మారుతున్నాయని ఆరోపించారు. వ్యాపార లేదా ఆర్థిక ప్రయోజనాల కారణంగా టీవీకేతో చర్చలు ప్రారంభించడంలో కాంగ్రెస్ వెనుకడుగు వేస్తోందని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్–టీవీకే పొత్తు కుదిరితే మైనారిటీ ఓట్లు, బీజేపీ వ్యతిరేక ఓట్లను సమీకరించే అవకాశం ఉందని ఆయన అన్నారు. గత నెల డిసెంబర్ 25న టీవీకే నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొనడం కూడా ఇరు పార్టీల మధ్య సమీపతకు సంకేతంగా భావిస్తున్నారు.

స్టార్ నటుడు విజయ్ 2024 అక్టోబర్‌లో తమిళగ వెట్రి కజగాన్ని ప్రారంభించారు. తమిళనాట డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలనే లక్ష్యంతో టీవీకే ముందుకు సాగుతోంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ డీఎంకేతో పొత్తులో కొనసాగుతున్న నేపథ్యంలో, టీవీకే–కాంగ్రెస్ సంబంధాలపై స్పష్టత రావాల్సి ఉందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories