హీరో సూర్యకు గాయం.. ఆందోళనలో ఫ్యాన్స్

హీరో సూర్యకు గాయం.. ఆందోళనలో ఫ్యాన్స్
x
Actor surya(File photo)
Highlights

తమిళ అగ్రకథానాయకుడు సూర్యకు తమిళ ఇండస్ట్రీలోనే కాదు.. ఇటు తెలుగులో కూడా భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు.

తమిళ అగ్రకథానాయకుడు సూర్యకు తమిళ ఇండస్ట్రీలోనే కాదు.. ఇటు తెలుగులో కూడా భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు.అయితే అలాంటి అభిమాన హీరోకు గాయాలయ్యాయన్న వార్త ఇప్పుడు సూర్య ఫ్యాన్స్‌లో ఆందోళన రేకెత్తిస్తోంది. సూర్యకు గాయం అయిందన్న వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆయన త్వరగా కోలుకోవాలని పలు ప్రాంతాల్లో ఫ్యాన్స్ పూజలు సైతం చేశారు.

సూర్య వర్కవుట్స్ చేస్తుండగా, ప్రమాదం జరిగి ఆయన ఎడమ చేతికి గాయమైంది. ఈ విషయాన్ని సూర్య సన్నిహితులు, బంధు వర్గాలు నిర్ధారించాయి. దీంతో ఆయన వెంటనే ఆసుపత్రికి వెళ్లి చికిత్స కూడా చేయించుకున్నారని సమాచారం. అయితే గాయం 90 శాతం నయం అయిందని వెల్లడించారు.

ఇక దీనిపై సూర్య అభిమానులు స్పందించారు. తనకు తగిలిందిపెద్ద గాయం కాదని, అభిమానులు ఆందోళన చెందవద్దని సూర్య సూచించారు. ప్రస్తుతం సూర్య, హరి దర్శకత్వంలో 'అరువా' చిత్రంలో నటిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories