మహిళా కమిషన్‌కు వివరణ ఇచ్చిణ నటుడు శివాజీ

మహిళా కమిషన్‌కు వివరణ ఇచ్చిణ నటుడు శివాజీ
x
Highlights

నటుడు శివాజీ ఈ రోజు బుద్ధ భవన్ లో గల తెలంగాణ మహిళా కమిషన్ కార్యాలయానికి చేరుకుని మహిళా కమిషన్ కు వివరణ ఇచ్చారు. దండోరా సినిమా ఈవెంట్లో మహిళల వస్త్రధారణపై శివాజీ అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై మహిళా కమిషన్ ఆయనకు నోటీస్ జారీ చేసింది.

హైదరాబాద్ : నటుడు శివాజీ ఈ రోజు బుద్ధ భవన్ లో గల తెలంగాణ మహిళా కమిషన్ కార్యాలయానికి చేరుకుని మహిళా కమిషన్ కు వివరణ ఇచ్చారు. దండోరా సినిమా ఈవెంట్లో మహిళల వస్త్రధారణపై శివాజీ అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై మహిళా కమిషన్ ఆయనకు నోటీస్ జారీ చేసింది. దాంతో శివాజీ మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు. 'దండోరా' సినిమా వేడుకలో హీరోయిన్స్‌ వస్త్రధారణపై చేసిన ఆయన వ్యాఖ్యలకు సంబంధించి వివరణ ఇచ్చారు.

హీరోయిన్స్‌ను ఉద్దేశించి శివాజీ చేసిన అభ్యంతర వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించిన మహిళా కమిషన్ వివరణ ఇవ్వాలని శివాజీకి నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో విచారణకు హాజరైన శివాజీ.. ఆ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. శివాజీ స్టేట్‌మెంట్‌ను మహిళా కమిషన్ రికార్డ్ చేసుకుంది. ఇప్పటికే ఈ అంశంపై సోషల్ మీడియా వేదికగా శివాజీ క్షమాపణలు చెప్పారు. తాను అన్న మాటలను వెనక్కి తీసుకుంటున్నానని, క్షమించాలని కోరారు.

అనుకోకుండా మాటలు దొర్లాయని మహిళా కమిషన్ ముందు శివాజీ స్టేట్‌మెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటామని నటుడు చెప్పినట్లు సమాచారం. శివాజీ వ్యాఖ్యలపై భిన్న స్పందనలు వచ్చాయి. మగవారితోపాటు మహిళలు కూడా కొందరు శివాజీని సమర్థించగా, యాంకర్ అనసూయతోపాటు పలువురు మహిళలు శివాజీని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఓ నాలుగు రోజులు సోషల్ మీడియా అంతా, ఈ అంశానికి సంబంధించిన వీడియోలే వైరల్ అయ్యాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories