Ravi Teja: అదేంటి రవితేజ అలా మారిపోయాడు.. చూస్తే అస్సలు గుర్తు పట్టలేరు

Actor Ravi Teja Latest Shocking Photo Goes Viral on Social Media
x

Ravi Teja: అదేంటి రవితేజ అలా మారిపోయాడు.. చూస్తే అస్సలు గుర్తు పట్టలేరు

Highlights

Ravi Teja: సైడ్‌ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ మొదలు పెట్టి స్టార్‌ హీరోల్లో ఒకరిగా ఎదిగారు రవితేజ. భారీ విజయాలను తన ఖాతాలో వేసుకున్న మాస్‌ మహారాజ ఇటీవల ఆశించిన స్థాయిలో విజయాలను అందుకోవడం లేదు.

Ravi Teja: సైడ్‌ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ మొదలు పెట్టి స్టార్‌ హీరోల్లో ఒకరిగా ఎదిగారు రవితేజ. భారీ విజయాలను తన ఖాతాలో వేసుకున్న మాస్‌ మహారాజ ఇటీవల ఆశించిన స్థాయిలో విజయాలను అందుకోవడం లేదు. రాజా ది గ్రేట్‌ తర్వాత మళ్లీ రవితేజ ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదనే చెప్పాలి. ఈ సినిమా తర్వాత రవితేజ హీరోగా వచ్చిన చిత్రాలన్నీ పరాజయం మూటగట్టుకున్నాయని చెప్పాలి.

దీంతో రవితేజ కెరీర్‌ ఒక్కసారిగా డీలా పడింది. చివరిగా వచ్చిన మిస్టర్‌ బచ్చన్‌ బాక్సాఫీస్‌ ముందు పరాజయాన్ని మూటగట్టుకుంది. హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా డిజాస్టర్‌గా మిగిలింది. ఇదిలా ఉంటే తాజాగా రవితేజ మాస్‌ జాతర అనే సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి.

ఇదిలా ఉంటే తాజాగా రవితేజకు సంబంధించి ఓ ఫొటో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. చాలా హుషారుగా, చబ్బీగా కనిపించే రవితేజ ఈ ఫొటోలో పూర్తిగా మారిపోయాడు. 57 ఏళ్ల వయసులోనూ తన ఎనర్జీతో అందరినీ మెస్మరైజ్‌ చేసే మాస్‌ మహారాజ బక్క చిక్కిపోయి కనిపించాడు. అలాగే మొఖంలోనూ తేడా కనిపిస్తోంది. ఎక్కువ వ్యాయామం, డైట్‌ చేయడం వల్ల రవితేజ ఇలాగా మారాడా అంటూ ఫ్యాన్స్‌ ఆందోళన చెందుతున్నారు.

అయితే ఇది తాజా ఫొటో కాదని, పాత ఫొటో మళ్లీ వైరల్‌ అవుతోందని కొందరు సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ చేస్తున్నారు. ప్రస్తుతం రవితేజ పర్‌ఫెక్ట్‌గా ఉన్నారని త్వరలోనే మాస్‌ జాతరతో మంచి విజయంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారని అంటున్నారు. మరి ఈ ఫొటో వెనకాల ఉన్న అసలు కథ ఏంటి? నిజంగానే రవితేజ ఇలా మారాడా లాంటి వివరాలు తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.


Show Full Article
Print Article
Next Story
More Stories