డాక్టర్‌తో, యాక్టర్ నిఖిల్‌ నిశ్చితార్థం.. పెళ్లి ఎప్పుడంటే

డాక్టర్‌తో, యాక్టర్ నిఖిల్‌ నిశ్చితార్థం.. పెళ్లి ఎప్పుడంటే
x
Nikhil Siddharth, Pallavi Varma,
Highlights

టాలీవుడ్ యువకథానాయకుడు నిఖిల్ ఎట్టకేలకు ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. కొద్దికాలంగా భీమవరానికి చెందిన డాక్టర్ పల్లవి వర్మతో ప్రేమలో ఉన్న నిఖిల్...

టాలీవుడ్ యువకథానాయకుడు నిఖిల్ ఎట్టకేలకు ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. కొద్దికాలంగా భీమవరానికి చెందిన డాక్టర్ పల్లవి వర్మతో ప్రేమలో ఉన్న నిఖిల్ నిశ్చితార్థం చేసుకున్నారు. నిఖిల్-పల్లవి వర్మల ప్రేమకు పెద్దల అంగీకరించిడంతో గోవాలో శనివారం కుటుంబ సభ్యలు, అత్యంత సన్నిహితులు మధ్య సమక్షంలో నిశ్చితార్థం వైభవంగా జరిగింది. ఏప్రిల్‌ 16న వీరి వివాహం జరుతుందని సమాచారం. నిఖిల్ తన లవ్ ప్రపోజ్‌ను గోవాలోనే డాక్టర్ పల్లవి వర్మకు తెలియజేయడంతో నిశ్చితార్థం కూడా అక్కడే చేసుకోవడం విశేషం.

ఇటీవలే మంచు లక్ష్మి నిర్వహించిన ఓ షోకు హాజరైన నిఖిల్ తన ప్రేమ విషయాన్ని బయటపెట్టారు. ఒక వైద్యురాలితో ప్రేమలో ఉన్నట్లు తెలిపారు. ఆమె తనను బాగా అర్ధం చేసుకునే అమ్మాయి అంటూ నిఖిల్ చెప్పుకొచ్చాడు. దీంతో ప్రముఖులు నిఖిల్‌కు శుభాకాంక్షలు తెలుపుతు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. నిఖిల్‌ డాక్టర్ పల్లవి వర్మకు ప్రపోజ్ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

నిఖిల్ నటించింన అర్జున్‌ సురవరం విడుదలైన విషయం తెలిసిందే. ఆ సినిమా బాక్సాఫీసు వద్ద విజయం సాధించింది. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన 'హ్యాపీడేస్' సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయమైయ్యారు. యువత, స్వామిరారా, కార్తికేయ, ఎక్కడికిపోతావు చిన్నోడా లాంటి విభిన్న సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మరింత దగ్గరైయ్యాడు నిఖిల్.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories