బాలకృష్ణతో శత్రుత్వం లేదు.. అలా మాట్లాడి ఉండకూడదు : నాగబాబు

బాలకృష్ణతో శత్రుత్వం లేదు.. అలా మాట్లాడి ఉండకూడదు : నాగబాబు
x
balakrishna, Nagababu(file photo)
Highlights

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో సినీ పెద్దలు సీఎం కేసీఆర్‌తో పలు దఫాలుగా చర్చలు జరిపి షూటింగ్‌లు ప్రారంభం కావడానికి కృషిచేస్తున్నారు.

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో సినీ పెద్దలు సీఎం కేసీఆర్‌తో పలు దఫాలుగా చర్చలు జరిపి షూటింగ్‌లు ప్రారంభం కావడానికి కృషిచేస్తున్నారు.త్వరలోనే ఏపీ సీఎం జగన్‌ను కూడా కలవబోతున్నట్లు చిరంజీవి ట్వీట్ లో తెలిపారు. ఈ నేపథ్యంలో సినీ పెద్దలతో ప్రభుత్వం జరుపుతున్న చర్చల గురించి తనకు తెలియని నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. చిత్రీకరణ అంశాలపై ప్రభుత్వంతో సినీ పెద్దలు జరుపుతున్న చర్చల విషయం తనకు పేపర్లో వచ్చే వార్తల ద్వారా మాత్రమే తెలిసిందని తెలిపారు. ఇండస్ట్రీ కోసం జరుగుతున్న చర్చలను భూములు పంచుకుంటున్నారా? అంటూ బాలయ్యా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

బాలయ్య చేసిన వ్యాఖ్యలపై నిర్మాత సి కళ్యాణ్ స్పందించగా.. మెగా బ్రదర్ నాగబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. నాగబాబు కూడా బాలయ్యకు కౌంటర్ ఇచ్చాడు. బాలకృష్ణ నోరు జారొద్దు.. అదుపులో పెట్టుకోవాలంటూ కౌంటర్ వేశాడు. ఈ సమావేశానికి ఎవర్ని పిలవాలో.. ఎవర్ని పిలవకూడదో కమిటీకి తెలుసు అంటూ రివర్స్ కౌంటర్ ఇచ్చారు. భూములు పంచుకుంటున్నారని బాలయ్య చేసిన వ్యాఖ్యలు బాధాకరం అని నాగబాబు అన్నారు . దాంతో పాటు ఈ వ్యాఖ్యలను వెంటనే బాలయ్య వెనక్కి తీసుకోవాలని కోరాడు. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడడం సరికాదని హితవు పలికాడు నాగబాబు. దీంతో ఈ ఇష్యూపై చర్చలు ముదిరాయి.

ఈ నేపథ్యంలో ఓ మీడియా ఛానల్‌ ఫోన్ ఇన్ కార్యక్రమం నాగబాబు మాటకదారు. నాగబాబు తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు హాజరైన ఆ సమావేశానికి ఎన్టీఆర్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తిని పిలవాల్సిన అవసరం లేదా? అని ఛానల్ ప్రతినిధి అడిగిన ప్రశ్నకు నాగబాబు బదులిచారు. ఆయనను కూడా చర్చలకు పిలిచి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. బాలకృష్ణతో ఎలాంటి విభేదాలు లేవని, శత్రుత్వం లేదని అన్నారు. సమావేశానికి ఎందుకు పిలవలేదని ఆయన ప్రశ్నించడంలో తప్పు లేదని, అయితే భూములు పంచుకున్నారని అనడం మాత్రం సరైంది కాదని నాగబాబు అన్నారు. గతంలో కూడా బాలయ్యను కమెడియన్ అని తాను అనలేదని నాగబాబు పేర్కొన్నారు .


హెచ్ఎంటీవీ లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

Show Full Article
Print Article
More On
Next Story
More Stories