Mahesh Babu: కచ్చితంగా చూడాల్సిన సినిమా.. ఆ మూవీపై మహేష్‌ బాబు రివ్యూ..!

Mahesh Babu Review on Raayan: స్టార్‌ హీరో మహేశ్‌ బాబు.. కేవలం తన సినిమాలు మాత్రమే కాకుండా ఇతర సినిమాలను కూడా ఎంతో ఇష్టంగా వీక్షిస్తుంటారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Updated on: 30 July 2024 11:18 AM IST
Actor Mahesh Babu Gives his Review on Danush Latest Movie Raayan
X

Mahesh Babu: కచ్చితంగా చూడాల్సిన సినిమా.. ఆ మూవీపై మహేష్‌ బాబు రివ్యూ..!

Mahesh Babu: స్టార్‌ హీరో మహేశ్‌ బాబు.. కేవలం తన సినిమాలు మాత్రమే కాకుండా ఇతర సినిమాలను కూడా ఎంతో ఇష్టంగా వీక్షిస్తుంటారు. ఇందులో భాగంగానే సినిమాలపై తన రివ్యూను కూడా అందిస్తుంటారు మహేష్. ఈ క్రమంలోనే తాజాగా విడుదలైన రాయన్‌ మూవీపై కూడా మహేష్‌ స్పందించారు. ధనుష్ స్వీయ దర్శకత్వంలో లీడ్‌ రోల్‌లో నటించిన రాయన్‌ మూవీ ఇటీవల విడుదలై విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటోంది.

ధనుష్‌ అద్భుత నటన, దర్శకత్వం సినిమాను విజయ తీరాలకు చేర్చింది. ఈ సినిమా చూసిన సెలబ్రిటీలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మహేష్‌ బాబు సైతం ఈ సినిమాపై స్పందించారు. ఎక్స్‌ వేదికగా రాయన్‌ మూవీపై తన రివ్యూను అందించారు. ఈ విషయమై మహేష్‌ ట్వీట్ చేస్తూ.. 'ధనుష్ అదరగొట్టారు. తన అద్భుతమైన దర్శకత్వంతో పాటు, మంచి నటతో ఆకట్టుకున్నారు. ఎస్‌జే సూర్య, ప్రకాశ్‌రాజ్‌, సందీప్ కిషన్‌లు సైతం అద్భుతంగా నటించారు. సినిమాలో నటించిన ప్రతీ ఒక్కరూ వందశాతం నటన కనబరిచారు' అని రాసుకొచ్చారు.

ఇక మ్యాస్ట్రో ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం మరో అద్భుతం. ‘రాయన్‌’ కచ్చితంగా అందరూ చూడాల్సిన సినిమా. చిత్రబృందానికి నా శుభాకాంక్షలు అని ప్రశంసలు కురిపించారు. ఇదిలా ఉంటే మహేష్‌బాబు చేసిన పోస్ట్‌కు సందీప్‌ కిషన్‌ స్పందించారు. మహేష్‌కు ధన్యవాదాలు తెలిపారు. కాగా ప్రముఖ కోలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ లోకేశ్‌ కనగరాజ్‌ ఈ చిత్రబృందాన్ని అభినందించారు. సినిమా విజయం సాధించినందుకు శుభాకాంక్షలు చెప్పారు. లారెన్స్‌ సైతం రాయన్‌ మూవీ యూనిట్‌పై ప్రశంసలు కురిపించారు.

సినిమాకు దక్కుతోన్న ప్రశంసలపై ధనుష్‌ ఆనందం వ్యక్తం చేశారు. తాను ఇప్పటి వరకు అందుకున్న బెస్ట్ బ్లాక్‌ బస్టర్‌ బర్త్‌ డే గిఫ్టే ఇదేనంటూ సంతోషం వ్యక్తం చేశాడు. తమ విజయాన్ని అందించిన సినీ ప్రేక్షకులు, ఆత్మీయులకు హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకొచ్చారు. తనపై అమితమైన ప్రేమ చూపించి, అండగా నిలబడుతున్న అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.


హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story