Actor Jayaprakash Reddy passed away: సీనియర్ సినీనటుడు జయప్రకాష్ రెడ్డి మృతి

Actor Jayaprakash Reddy passed away: సీనియర్ సినీనటుడు జయప్రకాష్ రెడ్డి మృతి
x
Highlights

Actor Jayaprakash Reddy passed away : సీనియర్ సినీనటుడు జయప్రకాష్ రెడ్డి గుండెపోటుతో మరణించారు.

సీనియర్ సినీనటుడు జయప్రకాష్ రెడ్డి ఈ తెల్లవావారుజామున మృతి చెందారు. లాక్ డౌన్ పెట్టినప్పటి నుంచి గుంటూరులోనే ఉంటున్న అయన ఈ తెల్లవారుజామున గుండెపోటు తో బాత్ రూమ్ లోనే కుప్పకూలి మరణించారు.

విలన్ గా, కామెడీ ఆర్టిస్ట్ గా జయప్రకాశ్ రెడ్డి తెలుగు సినిమా ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యారు. ఫాక్షన్ సినిమాలలో ఆయన విలన్ గా ప్రత్యేక నటన కనబరిచేవాడు. అనేక హిట్ సినిమాల్లో ఫ్యాక్షన్ సినిమాల్లో మెయిన్ విలన్గా ఆకట్టుకున్నారు. జయప్రకాష్ మరణంతో టాలీవుడ్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఈయన మరణానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories