Govinda: విడాకుల వార్తలపై స్పందించిన నటుడు గోవిందా..ఏమన్నారో తెలుసా?

Govinda
x

Govinda

Highlights

Govinda: బాలీవుడ్ నటుడు గోవింద తన భార్య సునీత అహుజాతో విడాకులు తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కొన్నిరోజులుగా వేర్వేరుగా...

Govinda: బాలీవుడ్ నటుడు గోవింద తన భార్య సునీత అహుజాతో విడాకులు తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కొన్నిరోజులుగా వేర్వేరుగా ఉంటున్నారని జాతీయ మీడియాలో కథనాలు కూడా వచ్చాయి. తాజాగా వీటిపై గోవింద స్పందించారు. విడాకులపై వస్తున్న వార్తలను ఖండించారు.

గతకొన్నిరోజుల నుంచి గోవిందా ఇంటికి ప్రముఖులు వెళ్తున్నారు. విడాకుల నేపథ్యంలోనే ప్రముఖులు వస్తున్నారంటూ కథనాలు వచ్చాయి. దీనిపై ఆయన ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించారు. మా ఇంటికి వస్తున్న ప్రముఖులంతా వ్యాపార చర్యల్లో భాగంగానే వస్తున్నారు. నేను కొత్త సినిమా పనుల్లో బిజీగా ఉన్నాను. అందుకే ఇంత మంది వస్తున్నారని చెప్పారు. ఇదే విషయంపై గోవిందా మేనేజర్ కూడా మాట్లాడారు. కుటుంబంలోని కొంద మంది చేసిన కామెంట్స్ కారణంగా ఈ వార్తలు ప్రచారం అవుతున్నాయి. వారిద్దరి మధ్య అభిప్రాయభేదాలు ఉన్నాయి. కానీ విడాకులు తీసుకునేంత పెద్దవి కావు. వాటిని పరిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. గోవిందా త్వరలోనే కొత్త సినిమాలను ప్రారంభించే పనుల్లో ఉన్నారు. అందుకే సినీ ప్రముఖులు కలిసేందుకు వస్తున్నారని అన్నారు. ఈ వార్తలపై గోవింద మేనకోడలు ఆర్తిసింగ్ స్పందించారు. అవన్నీ అవాస్తవాలేనని ఖండించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories