అన్నయ్యని ఏమైనా అంటే చంపేస్తా .. మెగాస్టార్ పై బ్రహ్మజీ ప్రేమ

అన్నయ్యని ఏమైనా అంటే చంపేస్తా .. మెగాస్టార్ పై బ్రహ్మజీ ప్రేమ
x
Highlights

విశ్వంత్‌ దుద్దుంపూడి, సంజ‌య్ రావు, నిత్యాశెట్టి ప్రధాన పాత్రలలో తెరకెక్కీన చిత్రం ఓ పిట్ట కథ .. ఇప్పటివరకు పెద్ద పెద్ద సినిమాలను నిర్మించిన భవ్య క్రియేషన్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది.

విశ్వంత్‌ దుద్దుంపూడి, సంజ‌య్ రావు, నిత్యాశెట్టి ప్రధాన పాత్రలలో తెరకెక్కీన చిత్రం ఓ పిట్ట కథ .. ఇప్పటివరకు పెద్ద పెద్ద సినిమాలను నిర్మించిన భవ్య క్రియేషన్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది. ఇప్పటివరకు రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం ద్వారా చందు ముద్దు అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. సినిమాని మార్చి 06 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.

సినిమా విడుదల తేది దగ్గరపడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిన్న హైదరాబాదులో నిర్వహించింది. ఈ వేడుకకి మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఇక ఈ సందర్భంగా నటుడు బ్రహ్మజీ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. " మా అబ్బాయితో సినిమా చేస్తున్నాను అంటే ఇండస్ట్రీలోని పెద్దలందరూ హెల్ప్ చేశారు.

ఇక ఈ సినిమా ప్రేక్షకులకి మరింత రీచ్ కావాలంటే ఎం చేయాలి అనుకున్నప్పుడు అన్నయ్య గుర్తుకువచ్చారు కానీ అయన షూటింగ్ తో బిజీ గా ఉంటారు. ఆయనని ఇబ్బంది పెట్టకూడదు అని అనుకున్నాను. కానీ దేవుడే ఆయనని ఇక్కడకి రప్పించాడు. చాలు మాకు సినిమా హిట్ అయినట్టే.. మాకు ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మెగాస్టార్ హ్యాండ్ బాగుంది. అంటూ మాట్లాడిన బ్రహ్మజీ చివర్లో ఎమోషనల్ అవుతూ.. అన్నుయ్యని ఎవరైనా ఏమైనా అంటే చంపేస్తాం అంటూ ఎమోషనల్ అయ్యారు. ఇక ఇదే వేడుకలో చిరంజీవి మాట్లాడుతూ.. సినిమాకి మంచి విజయాన్ని సాధించాలని చెప్పుకొచ్చారు.

టైటిల్ ని అనౌన్సు చేసిన చిరు :

ఇక ఇదే వేడుకలో మెగాస్టార్ తన తదుపరి చిత్రం టైటిల్ ని 'ఆచార్య'గా ప్రకటించించారు. కొరటాల శివ ఈ సినిమా టైటిల్ ని ఓ కార్యక్రమం పెట్టి అనౌన్సు చేద్దామని అనుకున్నాడు కానీ నా నోటి ద్వారా లాంఛ్‌ అయిపోయింది. సారీ శివ ఏమనుకోవద్దు. మంచి మాటలు అపుకోలేము అంటూ ఆపడం కూడా కరెక్టు కాదు అంటూ చిరంజీవి వెల్లడించారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్ , మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ కలిసి నిర్మిస్తోంది

చిరు తన తదుపరి చిత్ర టైటిల్ ని అనౌన్సు చేయడంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఇక ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. దసరాకి సినిమాని రిలీజ్ చేయనున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories